Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియోలో 2168 ఏళ్ల నాటి రికార్డు బద్దలు.. 'గోల్డ్ ఫిష్' ఖాతాలో మరో స్వర్ణం

రియో డి జ‌నీరో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా బంగారు చేప మైకేల్ ఫెల్ప్స్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ గోల్డ్ ఫిష్ 2168 యేళ్ళనాటి రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా ఒలింపిక్స్ క్రీడల్ల

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (14:03 IST)
రియో డి జ‌నీరో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా బంగారు చేప మైకేల్ ఫెల్ప్స్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ గోల్డ్ ఫిష్ 2168 యేళ్ళనాటి రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా ఒలింపిక్స్ క్రీడల్లో 22వ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, వ్యక్తిగతంగా ఇది 13వ గోల్డ్ మెడల్. 
 
తాజాగా జరిగిన 200 మీట‌ర్ల బ‌ట‌ర్‌ఫ్లై ఈవెంట్‌ను ఒక నిమిషం 54.66 సెకన్ల‌లో పూర్తి చేశాడు. రేసు మ‌ధ్య‌లో అత‌ని స‌హ‌చ‌రుడు లోషె గ‌ట్టి పోటీనిచ్చిన‌ట్లు క‌నిపించినా.. చివ‌రికి అత‌ను ఐదోస్థానంతో స‌రిపెట్టుకున్నాడు. రియోలో ఫెల్ప్స్ ఇప్ప‌టివ‌ర‌కు రెండు వ్య‌క్తిగ‌త‌, రెండు రిలే గోల్డ్ మెడ‌ల్స్ గెలిచాడు. ఇక వ్య‌క్తిగ‌త ఈవెంట్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 13 గోల్డ్ మెడ‌ల్స్ గెలిచి 2168 ఏళ్ల కింద‌ట లియోనిడాస్ (క్రీ.పూ.152లో) సృష్టించిన రికార్డును బీట్ చేశాడు. 
 
ప్రాచీన ఒలింపిక్స్‌లో భాగంగా క్రీ.పూ.164 నుంచి క్రీ.పూ.152 మధ్య రన్నర్ లియోనిడాస్ 12 వ్యక్తిగత స్వర్ణాలు గెలిచాడు. అంతేకాకుండా, వ‌ర‌ుస‌గా నాలుగు ఒలింపిక్స్‌లో 200 మీట‌ర్ల బ‌ట‌ర్‌ఫ్లై ఈవెంట్ గెలిచిన తొలి స్విమ్మ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఒకే ఈవెంట్‌ను వ‌ర‌స‌గా నాలుగు ఒలింపిక్స్‌లో గెలిచిన మూడో ఒలింపియ‌న్ ఫెల్ప్స్‌ కావడం గమనార్హం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments