Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్ 20 వరల్డ్ అథ్లెటిక్స్: సిల్వర్‌‌ మెడల్ సొంతం చేసుకున్న అమిత్ ఖాత్రి

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (20:05 IST)
Amit
అండర్ 20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ మీట్‌లో భారత్‌ రెండో మెడల్ తన ఖాతాలో వేసుకుంది. కెన్యాలోని నైరోబీలో జరుగుతున్న ఈ గేమ్స్‌లో శనివారం భారత అథ్లెట్‌ అమిత్‌ ఖాత్రి సిల్వర్‌‌ మెడల్ సొంతం చేసుకున్నాడు. 10km రేస్‌ వాక్‌ ఈవెంట్‌లో దేశానికి ఈ పతకం దక్కింది. 42 నిమిషాల 17.94 సెకన్ల రేస్ పూర్తి చేసిన అమిత్ రెండో స్థానంలో నిలిచాడు. కేవలం 7.1 సెకన్ల గ్యాప్‌లో అమిత్‌ గోల్డ్ మెడల్ కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు.
 
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ గేమ్స్‌కు ఆతిథ్య దేశమైన కెన్యా.. 10km రేస్‌ వాక్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. కెన్యాకు చెందిన అథ్లెట్‌ హెరిస్టోన్ వన్యోని 42 నిమిషాల 10.84 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 42 నిమిషాల 26.11 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచిన స్పెయిన్‌కు చెందిన అథ్లెట్ పాల్ మెక్‌గ్రాత్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments