Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెటర్ కపిల్ భాయ్‌కి మనోజ్ కుమార్ బాక్సింగ్ పంచ్..

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (15:50 IST)
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌కు హర్యానా బాక్సర్ మనోజ్ కుమార్ బాక్సింగ్ పంచ్ ఇచ్చాడు. తాను సాధించిన విజయాలకు అత్యంత సులభంగా రావాల్సిన అర్జున అవార్డును ఎంతో శ్రమించి సాధించుకోవాల్సిన దుస్థితి రావడంతో మనోజ్ కుమార్.. కపిల్ దేవ్‌పై మాటల తూటాలు పేల్చాడు. 
 
బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ హర్యానా బాక్సర్‌ మనోజ్‌కు ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ తనను అవార్డుకు ఎంపిక చేయకపోవడంతో పాటు నువ్వు ఎవరో నాకు తెలీదన్న కమిటీ ఛైర్మన్ కపిల్‌దేవ్‌పై ఈ సందర్భంగా ధ్వజమెత్తాడు. ‘ఈ రోజు కపిల్‌కు ఒక మాట చెప్పదల్చుకున్నా. నా పేరు మనోజ్ కుమార్. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్‌ను’ అని వ్యాఖ్యానించాడు.
 
తాను సాధించిన విజయాలకు సులువుగా రావాల్సిన అవార్డును ఎంతో కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నా ఘనతలను బట్టి చూస్తే ఈ అవార్డుకు నేను అర్హుడిని. డోపింగ్ విషయంలో ఎవరో నాపై వ్యతిరేక ఆరోపణలు చేశారు. అయితే అదంతా అబద్ధం. అర్జున జాబితా నుంచి నా పేరు తొలగించి కాంస్యం గెలిచిన వారికి అవార్డు ఇస్తున్నారని కపిల్‌కు గుర్తు చేశా. అయితే ఇలాంటి విషయాలు నాతో మాట్లాడొద్దని ఆయన ఫోన్ కట్ చేశారు’ అని మనోజ్ వెల్లడించాడు. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments