Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత తొలి మిస్టర్‌ యూనివర్స్‌ మనోహర్ ఐచ్ ఇకలేరు

స్వతంత్ర భారత తొలి 'మిస్టర్‌ యూనివర్స్‌'గా గుర్తింపు పొందిన మనోహర్‌ ఐచ్‌ ఆదివారం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆయన వయస్సు 104 యేళ్లు. ఆయన వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (09:27 IST)
స్వతంత్ర భారత తొలి 'మిస్టర్‌ యూనివర్స్‌'గా గుర్తింపు పొందిన మనోహర్‌ ఐచ్‌ ఆదివారం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆయన వయస్సు 104 యేళ్లు. ఆయన వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. రెండు వారాలుగా మనోహర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అతడి కుమారుడు కోకన్‌ తెలిపాడు. ఆదివారం తుది శ్వాస విడిచినట్టు చెప్పా డు. మనోహర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
 
1952లో మిస్టర్‌ యూనివర్స్‌గా గెలుపొందిన మనోహర్‌ ఏషియన్‌ గేమ్స్‌లో మూడు బంగారు పతకాలను సాధించారు. దిగ్గజ బాడీబిల్డర్‌ అయిన ఐచ్‌ స్ప్రింగ్‌ పుల్లింగ్‌ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచాడు. పాకెట్‌ హేర్‌క్యుల్స్‌గా పిలువబడే మనోహర్‌ బ్రిటీష్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన తర్వాత 1942లో దేహదారుఢ్యంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించి, భారత బాడీబిల్డింగ్ లెజెండ్‌గా ఖ్యాతికెక్కారు.
 
మనోహర్ ఐచ్‌ మరణవార్త తెలియగానే.. బెంగాల్‌ మాజీ క్రికెటర్‌, క్రీడా మంత్రి లక్ష్మీ రతన్‌ శుక్లా స్వయంగా మనోహర్‌ నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించాడు. 4 అడుగుల 11 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండే మనోహర్‌.. బ్రిటిషర్ల హయాంలో రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పనిచేసే సమయంలో బాడీ బిల్డింగ్‌ ఆరంభించాడు. బ్రిటిష్‌ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి జైలు జీవితం కూడా గడిపాడు.

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments