Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమయ్యా కేటీఆర్ గారూ.. ఇదేనా మీ పనితీరు... గుత్తా జ్వాలా

నిరంతరం ఏదో ఒక వివాదాస్పద వార్తతో మీడియాలో ఉండే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఈ దఫా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (08:57 IST)
నిరంతరం ఏదో ఒక వివాదాస్పద వార్తతో మీడియాలో ఉండే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఈ దఫా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. ప్రభుత్వపరంగా గతంలో ఇచ్చిన హామీల అమలు ఎక్కడ అంటూ నిలదీశారు. ఈ మేరకు సీఎం కార్యాలయానికి, మంత్రి కేటీఆర్‌కు ఖాతాలకు ట్యాగ్ చేసింది.
 
ఇదే అంశంపై ఆమె సోమవారం చేసిన ట్వీట్‌లో 'బ్యాడ్మింటన్‌ అకాడెమీ ఏర్పాటు చేసేందుకు స్థలం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం హామీ ఇచ్చింది. కానీ, ఈ విషయంలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. అలాగే గతంలో తెలంగాణ అథ్లెట్లకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ప్లాట్‌లు ప్రకటించింది. అందులో భాగంగానే నాకు కూడా ఇంటిస్థలం ఇస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటికీ ఆ నజరానా కూడా అందలేదు' అని జ్వాలా పేర్కొంది. 
 
ఈ ట్వీట్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)కు ట్యాగ్‌ చేసింది. అయితే, కొన్ని గంటల తర్వాత జ్వాల తన ట్వీట్‌ను తొలగించడం గమనార్హం. క్రీడాకారిణిగా చాలారోజుల క్రితమే ఆమె బ్యాడ్మింటన్‌కు దూరమైంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments