Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాకీ వరల్డ్‌ లీగ్‌ : డ్రాగా ముగిసిన దాయాదుల పోరు

Webdunia
శనివారం, 27 జూన్ 2015 (12:48 IST)
బెల్జియం వేదికగా శుక్రవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన హాకీ వరల్డ్‌ లీగ్‌లో పోటీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. గోల్‌ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ... మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లూ సమాన గోల్స్ చేశాయి. దీంతో మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో ఓటమెరుగని భారత్‌ గ్రూప్‌-ఎలో మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. 
 
ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. దీంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పై ఉత్కంఠత నెలకొంది. కానీ, ఈ మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది. అయితే, ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిందని చెప్పాలి. 
 
వచ్చే ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించడంతో భారత్‌ ఈ మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడింది. అయితే రియో బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగిన పాక్‌ మాత్రం దూకుడుగా ఆడినప్పటికీ సర్దార్‌ సేనను ఓడించలేకపోయింది. 
 
భారత ఆటగాడు రమణ్‌ దీప్‌ 13, 39వ నిమిషాల్లో రెండు ఫీల్డ్‌ గోల్స్‌ చేశాడు. మరోవైపు పాక్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ 23వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను, 37వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్స్‌గా మలిచాడు. దీంతో ఇరు జట్లూ సమానంగా రెండు గోల్స్ చేసి స్కోరును పంచుకున్నాయి. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments