Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు తెలుగమ్మాయి కాదు.. కర్ణాటక అమ్మాయి : హర్యానా సీఎం

పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా.. తెలంగాణ అమ్మాయా అన్న అనుమానం అక్కర్లేదు. ఆమె కర్ణాటక అమ్మాయి అని ఖట్టర్ తేల్చిపారేశారు.

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (13:06 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ఒక రజత పతకాన్ని సాధించి పెట్టిన భారత షట్లర్ పీవీ సింధు రాష్ట్రీయతపై వివాదాస్పదం నెలకొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సింధు తమ రాష్ట్రం వాసి అంటే.. కాదు తమ రాష్ట్రం వాసి అంటూ పోటీపడీ సన్మానాలు చేశాయి. రూ. కోట్లు ప్రోత్సాహక నగదు బహుమతులు ప్రకటించాయి.
 
ఇపుడు తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌‌లాల్ ఖట్టర్ సీన్లోకి ఎంటరయ్యారు. సింధు కర్ణాటకకు చెందిన అమ్మాయి అని చెప్పారు. చివరకు ఆమె పేరు కూడా సరిగా పలకలేదు. పీవీ సింధు ఆంధ్రా అమ్మాయా.. తెలంగాణ అమ్మాయా అన్న అనుమానం అక్కర్లేదు. ఆమె కర్ణాటక అమ్మాయి అని ఖట్టర్ తేల్చిపారేశారు. 
 
ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించి రియోలో భారతదేశానికి తొలి పతకం అందించిన సాక్షి మాలిక్‌ను ఆమె సొంత రాష్ట్రం హర్యానాలో ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆమెకు రూ.2.5 కోట్ల పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం
Show comments