Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి ఆరోపణలు... ఆరుగురు ఫిఫా అధికారులు అరెస్టు..

Webdunia
బుధవారం, 27 మే 2015 (17:24 IST)
అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య సంఘం (ఫిఫా) అత్యున్నత స్థాయి అధికారులు ఆరుగురిని స్విట్జర్ల్యాండ్ అధికారులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిఫా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జురిచ్లో ఉంది. 
 
జురిచ్లో జరిగిన ఫిఫా వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కార్యవర్గ సభ్యలు వచ్చారు. అమెరికా న్యాయశాఖ విన్నపం మేరకు స్విస్ అధికారులు అకస్మాత్తుగా ఫిఫా అధికారులు బస చేసిన హోటల్పై దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఫిఫాలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
ప్రపంచ ఫుట్కప్ల నిర్వహణకు బిడ్లు, మార్కెటింగ్, ప్రసార హక్కుల ఒప్పందాలకు సంబంధించి ఫిఫా అధికారులు అవినీతికి పాల్పడినట్టు అభియోగాలు వచ్చాయి. అమెరికా విన్నపం మేరకు స్విస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ కేసుపై దృష్టిసారించారు. కాగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై అభియోగాలు నమోదు చేయకున్న అధికారులు ఆయనను విచారించనున్నారు.

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

Show comments