Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎండబ్ల్యూ కారుకు బదులు సొమ్ము ఇస్తారట.. థ్యాంక్స్.. దీపా కర్మాకర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కానుకగా ఇచ్చిన ఖరీదైన బీఎండబ్ల్యూ కారును ఎందుకు తిరిగి ఇచ్చేశానో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ స్పష్టం చేసింది. సచిన్ సర్.. నాకు మీరు ఈ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే త్

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (14:43 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కానుకగా ఇచ్చిన ఖరీదైన బీఎండబ్ల్యూ కారును ఎందుకు తిరిగి ఇచ్చేశానో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ స్పష్టం చేసింది. సచిన్ సర్.. నాకు మీరు ఈ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే త్రిపురలో దీన్ని మెయింటైన్ చేయలేను.. దీనికి బదులు సొమ్ములివ్వడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్ అంటూ దీపా ట్వీట్ చేసింది. ఈ కారును సచిన్ చేతులమీదుగా హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీ నాథ్ అందజేసిన సంగతి తెలిసిందే. 
 
పీవీ సింధు, సాక్షి మాలిక్, గోపీచంద్‌లకు కూడా ఈ కార్లు గిఫ్ట్‌గా అందాయి. ఈ నేపథ్యంలో దీపా కర్మాకర్ తన వాహనాన్ని వాపస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే దాన్ని తిరిగి తీసుకునేందుకు స్పాన్సర్ చాముండేశ్వరీ నాథ్ సుముఖంగా లేరని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కారుకు బదులు సొమ్ము ఇచ్చేందుకు సచిన్ అంగీకరించినట్లు దీపా ట్వీట్ చేసింది. 
 
కాగా.. తన ఊరిలో రోడ్లు బాగాలేనందున ఈ కారును వెనక్కు తీసుకుని అందుకు ప్రతిగా తనకు డబ్బివ్వాలని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోరినట్టు వార్తలొచ్చాయి. కానీ కారును వెనక్కు తీసుకునేందుకు చాముండేశ్వరీ నాథ్ విముఖత వ్యక్తం చేశారు. ఇంకా దీపా కర్మాకర్ కోసం త్రిపుర రాజధాని అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ ను పెట్టించే విషయమై సంస్థ ప్రతినిధులతో మాట్లాడానని చాముండేశ్వరీనాథ్ తెలిపారు. 
 
ఈ విషయంలో స్పష్టత వచ్చిన తరువాతనే కారును వెనక్కు తీసుకోవాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ సొమ్ము ఇచ్చేందుకు సచిన్ అంగీకరించడంతో దీపా కారు వ్యవహారం కొలిక్కి వచ్చింది. కాగా, దీపతో పాటు మరో ముగ్గురు ఒలింపిక్ పతక విజేతలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేతుల మీదుగా ఈ లగ్జరీ కార్లను పొందిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments