Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ : మీరాభాయ్ 'గోల్డెన్ గాళ్'

వరల్డ్ ఛాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ ఛాను 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని భారత్‌‌‌ కీర్తిని ఇనుమడింపజేసింది.

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:33 IST)
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తొలుత రజత పతకంతో బోణీ చేసింది. పురుషులు వెయిట్ లిఫ్టింగ్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన గురురాజా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
 
ఈ క్రీడల తొలి రోజైన గురువారం బంగారు పతకం వచ్చింది. వరల్డ్ ఛాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ ఛాను 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుని భారత్‌‌‌ కీర్తిని ఇనుమడింపజేసింది. తన శరీరం బరువుకు రెట్టింపు కంటే ఎక్కువ బరువును ఎత్తడం ద్వారా (103 కిలోలు, 107 కిలోలు, 110 కిలోలు) ఓవరాల్ గేమ్ రికార్డును సొంతం చేసుకుంది. తద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
దీనిపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. 'గోల్డెన్ గాళ్' (స్వర్ణబాల) అంటూ మీరాభాయ్ ఛానుపై బిగ్ బి ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే, దేశం నలమూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, 21వ కామన్వెల్త్ క్రీడల ప్రారంభవేడుకలు బుధవారం అట్టహాసంగా జరుగగా, ప్రధాన పోటీలు గురువారం నుంచి మొదలయ్యాయి. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments