Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినేశ్‌ ఫోగాట్‌కు నిరాశ తప్పలేదు.. ఉత్తచేతులతో దేశానికి వచ్చేస్తోంది..

సెల్వి
గురువారం, 15 ఆగస్టు 2024 (07:27 IST)
Vinesh Phogat
భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌కు నిరాశ తప్పలేదు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్‌ ఫైనల్‌కు చేరింది. అయితే, ఫైనల్‌కు ముందు నిర్ణీత పరిమితి కంటే వంద గ్రాములు అధికంగా బరువు ఉన్నట్లు తేలడంతో అనర్హురాలిగా ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తనకు సిల్వర్‌ మెడల్‌ ఇవ్వాలంటూ చేసిన అప్పీల్‌ను స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ తిరస్కరించింది. కాస్‌ నిర్ణయంతో ఒలింపిక్‌లో పతకం సాధించాలన్న వినేశ్‌ కల చెదిరిపోయినట్లయ్యింది. 
 
వినేశ్ అప్పీలును ట్రిబ్యునల్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించడంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష నిరాశ వ్యక్తం చేశారు.
 
ఈ కేసులో వినేశ్ ఫోగాట్‌కు అనుకూలంగా తీర్పు వచ్చి ఉంటే, ఆమెకు రజత పతకం దక్కేది. కానీ సీఏఎస్ ఆమె పిటిషన్‌ను కొట్టివేయడంతో ఉత్తచేతులతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించినట్టయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

హైదరాబాదులో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం.. ఎందుకంటే?

వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

తర్వాతి కథనం
Show comments