Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ : చరిత్ర సృష్టించిన శ్రీకాంత్...

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగు కుర్రోడు కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్ ఛాంపియన్, చైనా ఆటగాడు చెన్ లాంగ్‌తో తలపడ్డ శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (12:17 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో తెలుగు కుర్రోడు కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్ ఛాంపియన్, చైనా ఆటగాడు చెన్ లాంగ్‌తో తలపడ్డ శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ టైటిల్‌ను ముద్దాడాడు. దీంతో వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు సాధించాడు. ఫైనల్ మ్యాచ్ తొలిసెట్‌లో 22-20తో ఆధిక్యంలో నిలిచినా శ్రీకాంత్.. రెండో సెట్‌(21-16)లోనూ అదే జోరు కొనసాగించి టైటిల్‌ను వశం చేసుకున్నాడు. 
 
ఇటీవలే జరిగిన ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిల్ విజేతగా శ్రీకాంత్ నిలిచిన విషయం విదితమే. సింగపూర్ టోర్నీలో శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. శ్రీకాంత్ గెలుపుతో అతడి స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. హర్షాతిరేకలు వ్యక్తం చేస్తూ.. బాణాసంచా కాల్చుతూ.. స్వీట్లు పంచుకున్నారు. 
 
కాగా, శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శ్రీ 21-10, 21-14తో ఆల్‌ఇంగ్లండ్ ఫైనలిస్ట్, నాలుగోసీడ్ షీ యుకీ (చైనా)పై సంచలన విజయం సాధించాడు. దీంతో కెరీర్‌లో వరుసగా మూడు సూపర్ సిరీస్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో సోనీ ద్వికుంకురో (ఇండోనేషియా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్, లిన్ డాన్ (చైనా) ఈ ఘనత సాధించారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana MLC Constituencies: తుది ఓటర్ల జాబితా విడుదల.. వివరాలివే..

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

ఉగాది నుండి అమలులోకి మహిళలకు ఉచిత బస్సు పథకం?

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

పేర్ని నాని భార్య జయసుధకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

తర్వాతి కథనం
Show comments