Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలే టెన్నిస్‌లోనూ రోజర్ ఫెదరర్‌కు చుక్కెదురు!

Webdunia
ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్‌కు హాలె టెన్నిస్ టోర్నమెంట్లోనూ చుక్కెదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ నెంబర్ వన్ లిటన్ హెవిట్‌తో జరిగిన మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ మెరుగ్గా రాణించలేకపోయాడు. తద్వారా హెవిట్ చేతిలో స్విజ్ మాస్టర్ ఖంగుతిన్నాడు.

అయితే తైవాన్‌కు చెందిన యెన్-సన్ లు హాలే ఓపెన్ రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. హాలే ఏటీపీ టోర్నీ తొలి రౌండ్లో ఫిన్‌లాండ్‌కు చెందిన జార్ఖో నిమినేన్‌తో తలపడిన లు 7-6 (7/2), 6-3 పాయింట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

ఈ సందర్భంగా లు మాట్లాడుతూ.. గ్రాస్ కోర్టులో నిమినేన్ ధీటుగా రాణిస్తాడు. నిమినేన్‌తో టఫ్ మ్యాచ్ ఆడాను. గ్రాస్ కోర్టులో తాను కూడా మెరుగ్గా ఆడటం ఎంతో సంతోషంగా ఉందని లు వెల్లడించాడు.

మరోవైపు ఏడో సీడ్ అలెగ్డాండర్ డొగొపొలొవ్ (ఉక్రెయిన్) కూడా హాలె టెన్నిస్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. హాలెండ్‌కు చెందిన రాబిన్ హాసేతో బరిలోకి దిగిన డొగొపొలొవ్ 6-7 (4/7), 6-4, 6-4 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments