Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లూతో వేగం తగ్గినా స్వర్ణం నెగ్గిన జమైకా చిరుత బోల్ట్!

Webdunia
ఫ్లూతో బాధపడినా హుస్సేన్ బోల్ట్ రేసులో వెనక్కి తగ్గలేదు. అరెవా డైమండ్ లీగ్ పురుషుల 200 మీటర్ల పరుగులో బోల్ట్ యూరోపియన్ చాంపియన్ క్రిస్ట్ఫో లెమైటర్ (ఫ్రాన్స్)ను సులభంగానే ఓడించినప్పటికీ, లక్ష్యాన్ని చేరడానికి 20.21 సెకన్లు తీసుకున్నాడు. వేగం తగ్గినా నిర్ణీత లక్ష్యాన్ని సునాయాసంగా చేధించి హుస్సేన్ బోల్ట్ స్వర్ణ పతకం సాధించాడు.

2009 బెర్లిన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 19.19 సెకన్లలోనే గమ్యాన్ని చేరుకొని, కొత్త రికార్డు నెలకొల్పాడు. అప్పడు బోల్ట్ దూసుకెళ్లిన విధానాన్ని, లక్ష్యాన్ని చేరుకున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, అతను అదే స్థాయిలో రాణించలేకపోయాడన్నది వాస్తవం. అయితే, ప్రత్యర్థిని చిత్తుచేయడం బోల్ట్ ఏమంత కష్టం కాలేదు.

రేస్ ఆరంభంలో వేగంగానే పరిగెత్తానని, లెమైటర్‌ను అధిగమించడం ఖాయమని తేలిన తర్వాత వేగం కొంచం తగ్గిందని బోల్ట్ వ్యాఖ్యానించాడు. సాంకేతిక లోపాల కారణంగా పోటీ 15 నిమిషాలు ఆలస్యంగా ఆరంభం కావడం కూడా తన వేగంపై ప్రభావం చూపిందని అన్నాడు.

రేస్‌కు సిద్ధమైన తర్వాత అంత సేపు వేచి ఉండడం కష్టమని అన్నాడు. ఫ్లూ కారణంగా ఇబ్బంది పడ్డాను. అయినప్పటికీ రేసులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాక కొన్ని కారణాలతో వేగం తగ్గినా స్వర్ణ సాధించుకోగలిగానని చెప్పుకొచ్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments