Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ టీమ్ చెస్ ఛాంప్స్: హరికృష్ణ ఓటమి

Webdunia
FILE
ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణకు చుక్కెదురయ్యింది. ఫలితంగా రెండో రౌండ్ లీగ్ పోటీలలో భారత్ 1-3 స్కోరుతో అమెరికా చేతిలో పరాజయం పాలయ్యింది. భారత బృందంలోని సూర్యశేఖర గంగూలీ, అరుణ్ ప్రసాద్‌లు తమ గేమ్‌లను డ్రాగా ముగించగా, శశికిరణ్ కూడా ఓటమిని చవిచూశాడు. కాగా.. రెండో రౌండ్ అనంతరం భారత్ రెండు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది.

తొలి రౌండ్‌లో అద్భుతమైన ఎత్తులతో అలరించిన భారత ఆటగాళ్లు రెండో రౌండ్‌లో అనూహ్యంగా వెనుకబడ్డారు. సిసిలియన్ వ్యూహంతో తొలి గేమ్ ఆడిన హైకర్ నకుమురా, శశికిరణ్‌ను పూర్తిగా కట్టడి చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్ చివరకు 46 ఎత్తులవద్ద ముగిసింది.

రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ క్వీన్స్ గాంబిట్ వ్యూహం ప్రదర్శించాడు. దీన్ని ప్రత్యర్థి అలెగ్జాండర్ ఆన్స్‌చుక్ సమర్థంగా ఎదుర్కోవటంతో 43 ఎత్తులవద్ద హరికృష్ణ గేమ్‌ను వదులుకున్నాడు. యూరీ సల్మాన్‌తో జరిగిన మూడో గేమ్‌ను గంగూలీ డ్రా చేసుకున్నాడు. దీంతో భారత్ కొంత కుదుటపడింది. అకోబియానతో జరిగిన గేమ్‌లో గెలుపు దగ్గర్లోకి వచ్చిన అరుణ్ 23 ఎత్తులవద్ద డ్రాతో సరిపెట్టుకున్నాడు.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments