Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్త్ జోన్ టీటీ ఛాంపియన్స్‌కు జమ్మూకాశ్మీర్ ఆతిథ్యం!

Webdunia
నార్త్ ఇండియా టెబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌కు జమ్మూకాశ్మీర్ ఆతిథ్యమిస్తోంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో ఆల్ టాప్ ర్యాంకింగ్ క్రీడాకారులు పాల్గొంటారు. జమ్మూ కాశ్మీర్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్‌తో పాటు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్ఐ)లు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా ఆరు వందల మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటారని యువజన వ్యవహారాల మంత్రి ఆర్.ఎస్. చిబ్ విలేకరులతో చెప్పారు. నేషనల్ ర్యాంకింగ్ టోర్నీ కావడంతో స్టార్ క్రీడాకారులు బరిలోకి దిగుతారని చిబ్ అన్నారు. సౌమ్యదీప్ రాయ్, సుబజిత్ సాహా, సౌరవ్, పౌలోమి ఘటక్‌లు పురుషుల విభాగంలోనూ, షామిని సౌమ్యజిత్ హోష్ హర్మీత్ దేశాయ్, మల్లికా బందర్కర్, మినికా బాద్ర వంటి స్టార్ క్రీడాకారులు పాల్గొంటారు.

పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, యూత్ బాయ్స్ సింగిల్స్, యూత్ గర్ల్స్ సింగిల్స్, జూనియర్ బాయ్స్ సింగిల్స్, జూనియర్ గర్ల్స్ సింగిల్స్, సబ్ జూనియర్ బాయ్స్ సింగిల్స్, సబ్ జూనియర్ గర్ల్ సింగిల్స్ వంటి వివిధ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు నగదు బహుమతులను అందజేసేందుకు రూ.ఐదులక్షల రూపాయలను కేటాయించినట్లు మంత్రి చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments