Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీఎఫ్ టోర్నీ: క్వార్టర్స్‌లో ఐదుగురు భారతీయులు

Webdunia
న్యూఢిల్లీలోని డీఎల్‌టీఏ కాంప్లెక్స్ వద్ద జరుగుతున్న మహిళల అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నీలో ఐదుగురు భారతీయులు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. రిషిక సుంకారా, ఇషా లక్కానీ, పరీజా మాలూ, సనా బంబారీ మరియు పారుల్ గోస్వామి తదితరులు లాస్ట్ ఎయిట్‌ (క్వార్టర్స్)లో బెర్త్ ఖరారు చేసుకున్నారు.

అయితే రెండో రౌండులో బ్రిటన్‌కు చెందిన టాప్ సీడ్ ఎమిలీ వెబ్లే.. భారత్‌కు చెందిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అదన్యా నాయక్‌పై 6-0, 6-0తో గెలుపొందింది. తన తర్వాతి మ్యాచ్‌లో భారత క్వాలిఫయర్ రిషికాతో ఎమిలీ తలపడనుంది. రెండో రౌండులో రిషికా.. ఫ్రాన్స్‌కు చెందిన ఎనిమిదో సీడ్ విక్టోరియా లారియరీపై 6-2, 6-3తో గెలుపొందింది.

మరోవైపు జపాన్‌కు చెందిన రెండో సీడ్ అంటాసియా మల్హోత్రాపై 7-5, 2-6, 6-3తో స్లొవేకియా క్రీడాకారిణి దాలియా జకుపోవిక్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. దీంతో తన తర్వాతి మ్యాచ్‌లో ఏడో సీడ్ అలెగ్జాండ్రా కొలెస్‌నిచెంకోతో జకుపోవిక్ తలపడనుంది.

ఐదో సీడ్ సానా.. పారుల్ గోస్వామితో తలపడనుండగా.. మూడో సీడ్ ఇషా.. ఆరో సీడ్ పరీజాతో తలపడనుంది. రెండో రౌండులో సానా... రంగ్టీన్ చుథారత్‌పై గెలుపొందగా.. గోస్వామి.. అంకితా రైనాపై విజయం సాధించింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments