Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీపీ రాట్టెర్‌డామ్ ఓపెన్: డేవిడ్ ఫెర్రర్‌కు చుక్కెదురు!

Webdunia
ఏటీపీ రాట్టెర్‌డామ్ టెన్నిస్ ఓపెన్‌లో మూడో సీడ్ డేవిడ్ ఫెర్రర్‌కు చుక్కెదురైంది. ఫిన్ జార్ఖో నిమినేన్‌తో జరిగిన ఆరంభ రౌండ్ మ్యాచ్‌లో స్పానియార్డ్ డేవిడ్ ఫెర్రర్ ధీటుగా రాణించలేకపోయాడు. తద్వారా 6-3, 6-4 తేడాతో డేవిడ్ ఫెర్రర్‌ ఖంగుతిన్నాడు.

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్ వరకు పోరాడిన డేవిడ్ ఫెర్రర్ ఏటీపీ రాట్టెర్‌డామ్ ఓపెన్‌లో మాత్రం భారీ షాట్లతో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయాడు. 75 నిమిషాల పాటు జరిగిన తొలి రౌండ్లో డేవిడ్ ఫెరర్ర ఓడిపోయాడు. దీంతో రాట్టెర్‌డామ్ ఓపెన్‌ నుంచి ఫెర్రర్ నిష్క్రమించాల్సి వచ్చింది.

కాగా, ఆరో ర్యాంకర్ అయిన డేవిడ్ ఫెర్రర్ ఈ టెన్నిస్ సీజన్లో తొలి తొమ్మిది మ్యాచ్‌లు గెలుచుకున్నాడు. మరో మ్యాచ్‌లో క్రోటియాకు చెందిన ఏడో సీడ్ ఇవాన్ జుబిసిక్ గెలుపును నమోదు చేసుకున్నాడు. ఉక్రెయిన్‌కు చెందిన సెర్జీ స్టావోస్కీని 7-6 (7/3), 6-3 తేడాతో ఓడించిన జుబిసిక్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments