Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా బాస్కెట్‌బాల్: భారత జట్టు ఓటమి

Webdunia
ఆసియా మహిళల బాస్కెట్‌బాల్ పోటీల్లో భారత జట్టుకు చుక్కెదురైంది. చెన్నై నగరంలో గురువారం జరిగిన ప్రారంభమ్యాచ్‌లో భారత జట్టు.. డిఫెండింగ్ ఛాంపియన్ కొరియా చేతిలో ఓటమిని చవిచూసింది.

" లెవల్ వన్" విభాగంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో భారత జట్టు కొరియాతో బరిలోకి దిగింది. అయితే ప్రత్యర్థి జట్టు ప్రదర్శించిన ఆటతీరుతో బెంబేలెత్తిన భారత జట్టుకు పరాజయం తప్పలేదు.

దీంతో ప్రపంచ బాస్కెట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 41వ స్థానంలోనూ, ఆసియా దేశాల్లో 7వ స్థానంలో ఉంది. మరోవైపు.. భారత్‌పై నెగ్గిన కొరియా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానాన్ని, ఆసియా దేశాల్లో అత్యున్నత స్థానంలో కొనసాగుతోంది.

అదేవిధంగా ఈ టోర్నీ లెవల్-2 విభాగంలో జరిగిన మ్యాచ్‌లలో ఫిలిప్పైన్స్ జట్టు 61-55 పాయింట్ల తేడాతో మలేషియాను మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో లెబనాన్ జట్టు 83- 68 పాయింట్ల తేడాతో ఉజ్భెకిస్థాన్ జట్టును ఓడించింది. అలాగే కజగస్థాన్ జట్టు 94-40 పాయింట్లతో శ్రీలంకపై నెగ్గింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments