Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్న కారునే వినియోగిస్తా... సచిన్ ఇచ్చిన కారును నాన్నకు గిఫ్టుగా ఇస్తా : సాక్షి మాలిక్

రియో ఒలింపిక్స్ విజేత‌లు పివి సింధు, పుల్లెల గోపీచంద్, సాక్షి మాలిక్‌ల‌తో పాటు, దీపా క‌ర్మాక‌ర్‌ల‌కు క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండుల్క‌ర్ బిఎమ్‌డ‌బ్ల్యూ కార్ల‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి విదితమే. అయితే సా

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (13:37 IST)
రియో ఒలింపిక్స్ విజేత‌లు పివి సింధు, పుల్లెల గోపీచంద్, సాక్షి మాలిక్‌ల‌తో పాటు, దీపా క‌ర్మాక‌ర్‌ల‌కు క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండుల్క‌ర్ బిఎమ్‌డ‌బ్ల్యూ కార్ల‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి విదితమే. అయితే సాక్షి మాలిక్ స‌చిన్ ఇచ్చిన కారుని ఉపయోగించదట. ఆమె త‌న పాత కారునే వాడాల‌నుకుంటోంది. 
 
రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... గ్లాస్గోలో 2014లో జ‌రిగిన కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో వెండిప‌త‌కం సాధించిన‌పుడు త‌న తండ్రి త‌నకు బ్లూ రంగు వి డ‌బ్ల్యు పోలో కారుని కొనిచ్చార‌ని… తాను దాన్నే వాడుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. 
 
మ‌రి సచిన్ ఇచ్చిన బిఎండ‌బ్ల్యు కారుని ఏం చేస్తార‌ని అడిగితే… ఆ కారును నాన్నకు కానుకగా ఇచ్చేస్తానని సంతోషంగా చెప్పింది. తన తండ్రి తన కోసం ఎన్నో త్యాగాలు చేశారని, అందుకే సచిన్ చేతుల మీదుగా అందుకున్న కారుని ఆయనకే ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

తర్వాతి కథనం
Show comments