Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా రాణించేనా

Hanumantha Reddy
FileFILE
చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ అనంతరం నేటి నుంచి హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. అయితే మహిళా విభాగంలో హైదరాబాద్‌కు చెందిన భారత ఆశాకిరణం సైనా నెహ్వాల్‌పై అంచనాలు ఓ మోస్తరుగానే ఉన్నాయని చెప్పాలి.
హాంకాంగ్‌ టోర్నీలో సైనా రాణించేనా..!
  బీజింగ్ ఒలింపిక్స్‌లోను క్వార్టర్స్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్‌లో చివరి నిమిషంలో ఓటమి చవిచూసింది. దాని తర్వాత జరిగిన టోర్నీ టైటిళ్లను దాదాపు వరుసగా గెలుపొందింది. అగ్రశ్రేణి క్రీడాకారిణిలపై సంచలన విజయాలనూ నమోదు చేసింది. అయితే ఇన్ని సంచలన విజయాలను..      


చైనా ఓపెన్ సిరీస్‌లో మహిళల విభాగంలో తొలి రౌండు నుంచే సైనా అనూహ్యంగా వెనుదిరిగినప్పటికీ.. ఈ ఏడాదిలో ఆమె సాధించిన టైటిళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ అంచనాలు తప్పు కావని అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో నాలుగు బ్యాడ్మింటిన్ టైటిళ్లను సైనా తన ఖాతాలో జమచేసుకుంది.

సెప్టెంబర్‌-2008లో జరిగిన చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ సమరంలో బలమైన ప్రత్యర్థిపై నెగ్గిన సైనా టైటిల్‌ను చేజిక్కించుకుంది. అలాగే ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, కామన్వెల్త్ యూత్ క్రీడలు-2008 టైటిల్, ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిళ్లను సైనా కైవసం చేసుకుంది.

2006 లో అంతర్జాతీయ టోర్నీల్లో ఆరంగేట్రం చేసిన సైనా ఫిలిప్పైన్స్ ఓపెన్ 4-స్టార్ బ్యాడ్మింటన్ టోర్నీని కైవసం చేసుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డ్ పుటల్లోకి ఎక్కింది. ఇదే ఏడాదిలో జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలోను రన్నరప్‌గాను నిలిచింది.

బీజింగ్ ఒలింపిక్స్‌లోను క్వార్టర్స్ వరకు వెళ్లింది. అయితే చివరి నిమిషంలో ఓటమి చవిచూసింది. దాని తర్వాత జరిగిన టోర్నీ టైటిళ్లను దాదాపు వరుసగా గెలుపొందింది. అగ్రశ్రేణి క్రీడాకారిణిలపై సంచలన విజయాలను నమోదు చేసింది. అయితే ఇన్ని సంచలన విజయాలను నమోదు చేసిన సైనాకు అనూహ్యంగా చైనా ఓపెన్ తొలి రౌండులోనే పరాభవం ఎదురుకావడం పట్ల భారత శిబిరం కాస్తంత ఆందోళనకు గురి అయింది.

ఏది ఏమైనప్పటికీ తాను టైటిల్ సాధించేందుకు అక్కడికి వెళ్తున్నానని.. అయితే అక్కడ అంతే స్థాయిలో తీవ్రమైన పోటీ ఉంటుందన్న విషయాన్ని మరువకూడదంటూ.. చైనా, హాంకాంగ్ ఓపెన్ సిరీస్‌లకు వెళ్లే ముందు భారత్‌లో విలేకుల సమావేశంలో సైనా తన మనోగతాన్ని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జరుగనున్న హాంకాంగ్ ఓపెన్ తొలి రౌండులో సైనా.. థాయ్‌ల్యాండ్‌‍కు చెందిన సలాక్‌జిత్ పొన్సానాతో పోటీ పడనుంది. అలాగే పురుషుల విభాగంలో చైనా ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు వెళ్లిన భారత ఆటగాడు అరవింద్ భట్‌కు.. హాంకాంగ్ ఓపెన్‌లో మాత్రం తొలి నుంచే పెద్ద సవాలు ఎదురు కానుంది. తొలి రౌండులో డెన్మార్క్‌కు చెందిన ఆరో సీడ్ జోచిమ్ పెర్సిన్‌తో తలపడనున్నాడు.

ఒక వేళ ఈ రౌండు దాటినా క్వార్టర్స్‌లో టాప్ ర్యాంకు క్రీడాకారుడు మలేషియాకు చెందిన చోంగ్ వీ లీను ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక అరవింద్‌కు ఈ టోర్నీ అగ్ని పరీక్షలాంటిదని చెప్పొచ్చు. మరో ఆటగాడు చేతన్ ఆనంద్ తొలి రౌండులో చెక్ రిపబ్లిక్‌కు చెందిన పీటర్ కౌకల్‌తో తలపడనున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments