Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా తేజం నాడియా పెట్రోవా

Pavan Kumar
సోమవారం, 26 మే 2008 (19:03 IST)
రష్యా యువతేజం నాడియా పెట్రోవా టెన్నిస్‌లో రాణిస్తూ ముందుకు దూసుకు వెళుతోంది. రష్యా యువతారలైన మరియా షరపోవా, మరియా కిర్లెంకోలతో పోటీపడుతూ ముందుకు సాగుతోంది పెట్రోవా. అయితే వ్యూహాత్మకంగా కీలకమైన మ్యాచ్‌లలో ఓడిపోతుండటం పెట్రోవా బలహీనత.

నాడియా పెట్రోవా రష్యా రాజధాని మాస్కోలో 1982, జూన్ 8వ తేదీన జన్మించింది. చిన్ననాటి నుంచే టెన్నిస్ క్రీడపై పెట్రోవా ఆసక్తి కనబరిచి దానిని నేర్చుకుంది. 1996లో ఆడిన తొలి ఐటీఎఫ్ సర్క్యూట్‌లో ఆడిన రెండు ఈవెంట్స్‌లో జయభేరి మోగించింది. ఐటీఎఫ్ టోర్నీలో తొలి సింగిల్స్ టైటిల్‌ను 1997లో పెట్రోవా కైవసం చేసుకుంది.

పెట్రోవా కెరీర్‌ను మలుపు తిరిగింది 1999లో. ఈ సంవత్సరం కెరీర్‌లో అత్యుత్తమంగా ఆడి 95వ ర్యాంకును పెట్రోవా చేరుకుంది. అలాగే ఆస్ట్రేలియన్, రోలాండ్ గారోస్, యూఎస్ ఓపెన్‌లకు ఎంపికైంది. 2003లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి రోలాండ్ గారోస్ గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరుకుంది. క్లిజస్టర్స్ చేతిలో పెట్రోవా పరాజయం పాలైంది. కెరీర్‌లో తొలిసారి సింగిల్స్ లింజ్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నా సిగియామా చేతిలో పరాజయం పాలైంది. ఇదే ఏడాది టాప్20 జాబితాలో పెట్రోవా అడుగుపెట్టింది.

2005 లో జరిగిన లింజ్ ఓపెన్ ఫైనల్లో పాటీ షిడ్నర్‌ను ఓడించి పెట్రోవా టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. అలాగే టాప్10లో స్థానం సంపాదించి ముందుకు సాగింది పెట్రోవా. పెట్రోవా ఆటతీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు సాగుతుందని ఆశిద్ధాం. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో నాడియా పెట్రోవా తలపడుతుంది. పెట్రోవా ఇప్పటివరకూ 7 సింగిల్స్, 12 డబుల్స్ టైటిళ్లను కైవసం చేసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments