Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూరో కప్ : క్లిష్టంగా మారిన గ్రూప్ సీ

Pavan Kumar
శనివారం, 14 జూన్ 2008 (19:53 IST)
ఆస్ట్రియా-స్విస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న యూరో కప్ 2008 పోరులో భాగంగా క్వార్టర్స్ దశలోకి ప్రవేశించే దానిపై గ్రూప్‌లో సందిగ్ధత నెలకొంది. ఫ్రాన్స్‌ను 4-1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీనితో రెండో స్థానం కోసం ఇటలీ-ఫ్రాన్స్‌ల మధ్య పోటీ నెలకొంది.

రొమేనియా ఆటగాళ్లు వ్యూహాత్మకంగా ఆడి 2006 ప్రపంచ ఛాంపియన్ ఇటలీ తమతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించకుండా అడ్డుకున్నారు. ఇటలీ-రొమేనియాలు రక్షణాత్మక ధోరణితో ఆడాయి. మ్యాచ్ మలి అర్ధ భాగంలో 55వ నిమిషంలో రొమేనియా ఆటగాడు ముతు గోల్ చేసి జట్టును ఆధిక్యం దిశగా నడిపించాడు.

ఇటలీ క్రీడాకారుడు పానౌసీ అయితే ఆ తదుపరి నిమిషంలో గోల్ చేసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. మ్యాచ్ చివర్లో రొమేనియాకు పెనాల్డీ కిక్ కొట్టే అవకాశం రాగా దానిని ఇటలీ కీపర్ సమర్ధంగా అడ్డుకున్నాడు.

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-4 గోల్స్ తేడాతో 2006 ప్రపంచ కప్ ఫైనలిస్ట్ ఫ్రాన్స్ పరాజయం పాలైంది. హాలెండర్లు మ్యాచ్ ఆరంభం నుంచి ఫ్రాన్స్ గోల్ పోస్ట్‌పై దాడులు చేశారు. మ్యాచ్‌లో హాలెండ్ క్రీడాకారులు క్యుట్ (9 ని.), వాన్ పెర్సీ (59 ని.), రాబెన్ (72 ని.), స్నెజ్దర్ (92 ని.) లు గోల్స్ చేసి ఫ్రాన్స్ ఆశలుపై నీళ్లు చల్లారు.

ఫ్రాన్స్ తరుపున హెన్రీ 71వ నిమిషంలో గోల్ చేశాడు. అప్పటికే జరగాల్సింది అయిపోయింది. 2006 ప్రపంచ కప్ ఫైనల్లో ఇటలీపై ఎదురైన పరాజయాన్ని గుర్తు పెట్టుకుని వారిపై ఫ్రాన్స్ విజయం సాధిస్తేనే క్వార్టర్స్‌లోకి అడుగుపెడుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments