Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోనిక డోపింగ్ వ్యవహారం : సాయ్ అధికారి బదిలీ

Webdunia
డోపింగ్ వ్యవహారంలో ఒలింపిక్ క్రీడలకు దూరమైన వెయిట్ లిప్టర్ మోనికా దేవి వ్యవహారానికి సంబంధించి సాయ్ అధికారి ఒకరిపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న టీమ్ డివిజన్ డైరెక్టర్ ఆర్.కె. నాయుడును భోపాల్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయమై ప్రత్యేక విచారణ జరిపిన టి.ఎస్. కృష్ణమూర్తి సమర్పించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజింగ్ ఒలింపిక్‌కు బయలుదేరేందుకు కాస్త సమయమే ఉందన్న తరుణంలో మోనిక డోపింగ్ టెస్ట్‌లో విఫలమైందంటూ సాయ్ వెల్లడించింది. దీంతో బీజింగ్ ఒలింపిక్‌కు మోనిక వెళ్లకుండా సాయ్ నిషేధించింది.

దీంతో మోనికకు మద్దతుగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల నేపథ్యంలో మోనిక బీజింగ్ వెళ్లవచ్చంటూ రివ్యూ కమిటీ ఉత్తర్వులిచ్చినా అప్పటికే ఒలింపిక్ ఎంట్రీల గడువు ముగియడంతో మోనిక బీజింగ్ ఒలింపిక్‌లో పాల్గొనలేక పోయింది. ఈ వ్యవహారంలో తనకు ద్రోహం జరిగిందంటూ మోనిక పత్రికలకెక్కడంతో ప్రభుత్వం ఓ విచారణ కమిటీని నియమించింది. టి.ఎస్.కృష్ణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ విచారణలో మోనికకు సంబంధించి ఎలాంటి ద్రోహం జరగలేదని తేలింది.

అయితే మోనిక డోపింగ్ టెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో సాయ్ ఉదాసీనతతో వ్యవహరించిందని అందుకే ఈ వ్యవహారం ఇంత రసాభాసగా మారిందని కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగానే అధికారులు సాయ్ అధికారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments