Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్ వేదికగా పారాలింపిక్స్-2008

Webdunia
శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (16:10 IST)
విశ్వక్రీడలైన ఒలింపిక్స్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చైనా ప్రస్తుతం పారాలింపిక్స్‌ను సైతం అదే రీతిలో నిర్వహించడానికి సిద్ధమైంది. బీజింగ్ వేదికగా శనివారం నుంచి ఈ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి.

మొత్తం 150 దేశాల నుంచి విచ్చేయనున్న నాలుగువేలకు పైగా వికలాంగ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పారాలింపిక్ సందర్భంగా 21 క్రీడాంశాల్లో పతకాల కోసం క్రీడాకారులు పోటీపడనున్నారు.

ఆర్చరీ, అధ్లెటిక్, బోసియా, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, గోల్‌బాల్, జూడో, పవర్ లిఫ్టింగ్, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ సిట్టింగ్, వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్, వీల్‌చెయిర్ ఫెన్సింగ్, వీల్‌చెయిర్ రగ్బీ, వీల్ ఛెయిర్ టెన్నిస్ తదితర క్రీడాంశాల్లో ఈ పారాలింపిక్స్ పోటీలు జరగనున్నాయి.

కొద్దిరోజుల క్రితం విశ్వక్రీడలను అత్యంత వైభవంగా నిర్వహించిన చైనా ఈ పారాలింపిక్స్ ప్రారంభోత్సవాలను సైతం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లతో బీజింగ్ నగరం ఇప్పటికే ముస్తాబైంది. బీజింగ్ నగరంలో శనివారం ప్రారంభోత్సవాలను నిర్వహించి ఆదివారం నుంచి పారాలింపిక్స్ పోటీలను ప్రారంభించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Show comments