Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా వరల్డ్‌కప్ సమరం: నాకౌట్ రౌండ్‌కు జట్లు రె "ఢీ"!

Webdunia
PTI
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫిఫా ప్రపంచకప్ పోటీల్లో భాగంగా శనివారం నుంచి నాకౌట్ రౌండ్ ప్రారంభం కానుంది. 19వ సాకర్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్న 32 జట్లను 8 విభాగాలుగా విభజించి, నాకౌట్ రౌండ్‌ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

శుక్రవారం (జూన్ 25)తో లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తి కావడంతో, 16 జట్లు క్వార్టర్స్‌కు ముందు జరిగే నాకౌట్ దశకు అర్హత సాధించాయి. మిగిలిన 16 జట్లు లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటిసారిగా జరిగే సాకర్ ప్రపంచకప్‌లో పేలవమైన రికార్డులు నమోదు కావడం గమనార్హం. ప్రతిష్టాత్మక సాకర్ వరల్డ్ పోటీలకు ఆతిథ్య మిచ్చే దక్షిణాఫ్రికాకు లీగ్ దశలోనే చుక్కెదురైంది. ఇదేవిధంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ, గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్‌లు కూడా ఒకే సమయంలో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

ఈ నేపథ్యంలో, నాకౌట్ దశకు చేరుకున్న సాకర్ ప్రపంచకప్ పోటీలపై అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై సాకర్ కోలాహలం రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో, నాకౌట్ సమరంలో ఏయే జట్లను విజయాలు వరిస్తాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

కాగా.. ఇకపై జరిగే సాకర్ మ్యాచ్‌ల్లో 90 నిమిషాల్లో డ్రా గా ముగిసే మ్యాచ్‌లకు 15 నిమిషాలను అదనంగా కేటాయిస్తారు. మ్యాచ్ ఫలితాల నిర్ణయానికే ఈ అదనపు సమయాన్ని కేటాయించారు. అయితే సమ పాయింట్ల ఆధిక్యం వహించే జట్ల ఫలితాలను పెనాల్టీ షాట్ అవుట్ పద్ధతిలో నిర్ణయిస్తామని నిర్వాహకులు తెలిపారు.
PTI


ఇకపోతే.. శనివారం జరిగే నాకౌట్ దశ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం 7.30 గంటలకు ప్రారంభంమవుతాయి. తొలి నాకౌట్ మ్యాచ్‌లో "ఎ" గ్రూప్‌లో తొలి స్థానం కైవసం చేసుకున్న ఉరుగ్వే, "బి" గ్రూప్ రెండో స్థానంలో ఉన్న దక్షిణ కొరియాలు తలపడతాయి. ఇందులో విజేతగా నిలిచే జట్టు క్వార్టర్ పైనల్లోకి చేరుకుంటుంది.

రెండోసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వే, 1970వ సంవత్సరానికి తర్వాత క్వార్టర్ ఫైనల్లోకి చేరుకోలేకపోయింది. లీగ్ రౌండ్లో మెక్సికో, దక్షిణాఫ్రికాను గెలిచిన ఉరుగ్వే, ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఫామ్‌లో ఉన్న ఉరుగ్వే విజయావకాశాలు మెరుగ్గా ఉండటంతో సుదీర్ఘ విరామం తర్వాత ఈ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

ఇదేవిధంగా శనివారం అర్థరాత్రి జరిగే మ్యాచ్‌లో "సి" గ్రూప్‌లో తొలి స్థానంలో ఉన్న అమెరికా, "డి" విభాగంలో రెండో స్థానంలో ఉన్న కెనడాల మధ్య పోటీ ఉంటుంది. ఇంకా సాకర్ నాకౌట్ దశకు ఆరు ఆఫ్రికా జట్టుల్లో ఒక ఘనా మాత్రమే ప్రవేశించింది.

ఈ విషయమై ఘనా కోచ్ రాజేవిక్ మాట్లాడుతూ.. సాకర్‌లో పాల్గొన్న ఆఫ్రికా దేశాల్లో తమ జట్టు మాత్రం నాకౌట్‌కు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. అయితే ప్రేక్షకులు, అభిమానుల అంచనాకు అనుగుణంగా మైదానంలో రాణించేందుకు ఘనా సాయశక్తులా ప్రయత్నిస్తుందని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా తమ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టుపై గట్టిపోటీని ప్రదర్శిస్తారని కోచ్ చెప్పారు.

కాగా.. నాకౌట్ తొలి మ్యాచ్‌లో ఘనా అగ్రశ్రేణి అమెరికాతో తలపడనుంది. అమెరికాలో పటిష్టమైన క్రీడాకారులుండటంతో ఘనా జట్టుకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఘనా కూడా అమెరికాతో ధీటుగా రాణిస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments