Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన తర్వాత ఫేడవుట్ అయిన సానియా ఇమేజ్..!!

Webdunia
PTI
షోయబ్ మాలిక్‌తో ప్రేమాయణం బయటపడిన తర్వాత వివాదాస్పద రీతిలో వివాహం చేసుకున్న భారత్ టెన్నిస్ ఏస్ సానియా మీర్జా ఇమేజ్ డ్యామేజ్ అవడంతోపాటు పాయింట్ల పట్టికలోనూ అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఒకప్పుడు టాప్ 29 స్థానానికి ఎగబాకిన సానియా ఇప్పుడు ఏకంగా టాప్ 150లోనే స్థానం కోల్పోయారు. ప్రాక్టీసు కొరవడటంతో పేలవమైన ఆటతీరును కనబరుస్తూ ఎక్కిన మెట్లను ఒక్కొక్కటిగా కిందికి దిగుతోంది.

ఆమె ర్యాంకుల పట్టికకు సంబంధించి గత రికార్డులను ఒక్కసారి పరిశీలిద్దాం.

2007 ఆగస్టులో సానియా మీర్జా తన కెరీర్‌లో శిఖరానికి చేరుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఆమె 915 పాయింట్లను సాధించి 29వ ర్యాంకులో నిలిచింది. ఆ దశలో టాప్ 20లోకి ప్రవేశించేందుకు యత్నాలు మొదలుపెట్టింది. ఆ తర్వాత 2008 ఆగస్టు 11 నాటికి అంటే సుమారు ఓ సంవత్సర కాలం అనంతరం 65వ స్థానంలో నిలిచింది. తిరిగి ఓ వారం తర్వాత మళ్లీ పుంజుకుని 63 స్థానానికి చేరుకుంది. అయితే ఆ ఆనందం వారం తిరక్కుండానే జారిపోయింది. 2008 ఆగస్టు 25న ఆమె 70 స్థానానికి చేరుకుంది.

ఆ తర్వాత దిగజారుడు క్రమంగా పెరిగింది. 2008 అక్టోబరు 27న 97వ ర్యాంకులో నిలిస్తే, అదే ఏడాది నవంబరులో 99గా నిలిచింది. ఇక డిసెంబరు నెలలో 101కి చేరుకుని ఆటపై పూర్తి ఆసక్తిని కోల్పోయినట్లు కనబడింది. షోయబ్ మాలిక్‌తో ప్రేమాయణం మహిమో ఏమోగానీ 2009 ప్రథమార్థం నుంచి ర్యాంకుల పట్టికలో దిగజారుడే కానీ ఎక్కుడు ఎక్కడా కనిపించలేదు.

2009 ఫిబ్రవరి 2న ఆమె స్థానం 108 నుంచి 127కి మారింది. మరో వారం గడిచిన తర్వాత చూస్తే ఒక్క పాయింటు పైకి ఎగబాకుతూ 127 నుంచి 126కి వచ్చింది. ఆ తర్వాత టాప్ 100 జాబితాలోకి చేరినా ప్రస్తుతం 160 ర్యాంకుతో తన ఆటతీరుపై సగటు టెన్నిస్ క్రీడాభిమానల్లో ఆసక్తిని రేకిత్తించలేక విఫలమవుతోంది.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments