Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా స్వర్ణం క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది : బింద్రా

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2008 (11:53 IST)
బీజింగ్ ఒలింపిక్‌లో తాను సాధించిన స్వర్ణ పతకం దేశంలోని క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని షూటర్ అభినవ్ బింద్రా పేర్కొన్నాడు. తాను స్వర్ణం సాధించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఒలింపిక్‌లో భారత్ మరిన్ని పతకాలు సాధిస్తుందని బింద్రా ఆశాభావం వ్యక్తం చేశాడు.

బీజింగ్ ఒలింపిక్‌లో తాను స్వర్ణం సాధించడం వల్ల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), సాయ్‌లు క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని అందించగలవని తాను భావిస్తున్నట్టు బింద్రా తెలిపాడు. అలాగే తాను స్వర్ణం సాధించడం ద్వారా దేశంలోని వర్ధమాన క్రీడాకారుల్లో ప్రోత్సాహం పెరుగుతుందని బింద్రా పేర్కొన్నాడు.

ఇలా తాను అనుకున్న విధంగా జరిగితే వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ 15 పతకాలతో తిరిగి వస్తుందని బింద్రా అభిప్రాయపడ్డాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా అభినవ్ బింద్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. బింద్రాకు ముందు ఒలింపిక్స్‌‍ చరిత్రలో భారత్ తరపున వ్యక్తిగత స్వర్ణం సాధించిన క్రీడాకారుడే లేకపోవడం గమనార్హం.

అదేసమయంలో మొట్టమొదటగా బీజింగ్ ఒలింపిక్స్‌లో మాత్రమే భారత్ మూడు పతకాలు సాధించింది. షూటింగ్ విభాగంలో బింద్రా స్వర్ణం సాధిస్తే బాక్సింగ్ విభాగంలో విజేందర్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్‌లు కాంస్య పతకాలు సాధించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments