Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టెన్నిస్ వరల్డ్ కప్" వింబుల్డన్‌ హీరో ఎవరో..?

Webdunia
FILE
లండన్‌లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పేరెన్నికగన్న వింబుల్డన్ టెన్నిస్ ఈవెంట్ సోమవారం లాంఛనంగా ఆరంభం కానుంది. ప్రతి ఏడాది జరిగే నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మూడోదైన వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో, ఈ ఏడాదికూడా టాప్‌సీడ్ల హవా కొనసాగనుంది.

" టెన్నిస్ ప్రపంచకప్"గా పిలువబడే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు గత రెండు వారాల నుంచి టాప్ సీడ్ టెన్నిస్ క్రీడాకారులు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్, ఆరుసార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న రోజర్ ఫెదరర్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్నాడు.

ఏటీపీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఈసారి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. గ్రాస్‌కోర్టులో అద్భుతంగా ఆడే రోజర్ ఫెదరర్, కొలంబియాకు చెందిన అలెగ్జాండ్రో ఫాలాతో తొలి రౌండ్లో తలపడనున్నాడు.

ఒకవేళ ఈ ఏడాది కూడా వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఫెదరర్ గ్రేట్ పీట్ సంప్రాస్ సరసన చేరనున్నాడు. కానీ ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌ విజేత, నెంబర్ వన్ ర్యాంకర్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ నుంచి రోజర్ ఫెదరర్‌కు గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. కాగా.. రఫెల్ నాదల్ తన తొలి రౌండ్లో జపాన్‌కు చెందిన కీయ్ నిషికోరితో టైటిల్ వేటను ఆరంభించనున్నారు. దీంతో వింబుల్డన్‌ హీరో రోజర్ ఫెదరర్? లేదా రఫెల్ నాదలా? అని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

ఇదేవిధంగా జకోవిక్ (సెర్బియా), ఆండీ ముర్రే (ఇంగ్లాండ్), ఆండీ రాడిక్ (అమెరికా), హెవిట్ (ఆస్ట్రేలియా), డేవిడెంకో (రష్యా), వెర్దాస్కో (స్పెయిన్), మరిన్ సిలిచ్ (ఖురేషియా), సోదర్లింగ్ (స్వీడెన్) వంటి స్టార్ ఆటగాళ్లు వింబుల్డన్ గ్రాస్ కోర్టు మైదానంలో తలపడనున్నారు.

ఇకపోతే.. సింగిల్స్ విభాగంలో అమెరికా సిస్టర్స్ ఫేవరేట్లుగా బరిలోకి దిగనున్నారు. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాలను సొంతం చేసుకున్న సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌లు ప్రత్యర్థులపై గట్టిపోటీని ప్రదర్శించి, టైటిల్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు.

అలాగే.. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జాకు క్లిష్టమైన డ్రా ఎదురుకానుంది. సింగిల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా 54వ ర్యాంకర్ ఏంజెలిక్‌తో బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో సానియాను విజయం వరిస్తే రెండో రౌండ్లో షహర్ పీర్ (ఇజ్రాయేల్)తో తలపడుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments