Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్నిస్‌ యనికపై యువతారలు

Webdunia
భారత టెన్నిస్ యనికపై సానియా మీర్జా పేరు తెలియని వారుండరు. ముఖ్యంగా భారత్‌లో టెన్నిస్... సానియా మీర్జా పేర్లు ఒకదానికొకటి పర్యాయపదాలుగా మారిపోయాయి. అయితే.. తాజాగా మన రాష్ట్రానికే చెందిన యువ టెన్నిస్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభతో అందరిని ఆకట్టుకుంటున్నారు. వీరిలో సాయితేజ, వీరమాచనేని అర్చన, ఇష్కా తీర్థ, విక్రమ్ రెడ్డి, అనుష్క భార్గవ వంటి వారు ముఖ్యులు.

అంతర్జాతీయ టెన్నిస్ రంగంలో ఇటీవలి కాలంలో వినిపిస్తున్న వీరిలో కొందరు ఆసియా అండర్-14లోను, మరొకరు జూనియర్ సర్క్యూట్‍‌లో ఇలా ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణిస్తూ తమ ప్రతిభకు పదును పెట్టుకుంటున్నారు. వీరిలో కొందరి గురించి తెలుసుకుందాం..

అనుష్క.. అరేళ్ళ ప్రాయంలోనే టెన్నిస్ రాకెట్ పట్టిన చిన్నారి అనుష్క. అండర్-12, అండర్-14లలో ఎనిమిదో స్థానంలోను, ఆసియాలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

విక్రమ్ రెడ్డి.. పదునైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై పిరుచుకుపడే 17 ఏళ్ళ విక్రమ్ 2005-06లో 15వ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. 2004-06 వరకు మొత్తం 16 జాతీయ స్థాయి టైటిల్స్‌ను సొంతం చేసుకుని తన సత్తా చాటిన యువ క్రీడాకారుడు.

సాయితేజ.. ఆసియా టెన్నిస్ సర్క్యూట్‌లో తిరుగులేని ఆటగాడిగా ఖ్యాతి గడించిన సాయి తేజ జూనియర్ స్థాయిలో తనేంటో ఈ పాటికే నిరూపించుకున్న క్రీడాకారుడు. ఐటీఎఫ్ జూనియర్ విభాగంలో బరిలోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న క్రీడకారుడు. ఇలాగే.. మరికొందరు యువ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ టెన్నిస్ రంగంలో క్రీడలో ధృవతారలా ముందుకు దూసుకొస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Show comments