Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా వేదికగా ఫుట్‌బాల్ టోర్నీ ఐలీగ్ ప్రారంభం

Webdunia
శనివారం, 27 సెప్టెంబరు 2008 (14:09 IST)
దేశవాళీ మెగా ఫుట్‌బాల్ టోర్నీ అయిన ఐలీగ్ శుక్రవారం ప్రారంభమైంది. కోల్‌కతాలోని బరాసత్ మైదానంలో ఈ ఐలీగ్ పోటీలు జరగనున్నాయి. దేశీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో మెగా టోర్నీగా భావించే ఈ ఐలీగ్‌లో గెలుపొందిన విజేతకు రూ. 45 లక్షలు లభించడం విశేషం.

బరాసత్ మైదానంలో శుక్రవారం ప్రారంభమైన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు, చిరాగ్ యునైటెడ్ ఎస్‌సీ జట్టు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలాయించింది. ఆట ప్రారంభమైన మొదటి 20 నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ సాధించి చిరాగ్ జట్టుపై ఒత్తిడి పెంచింది.

దీంతో ఆట ప్రధమార్థం ముగిసే సరికి ఈస్ట్ ఇండియా 3-0 ఆధిక్యం సాధించింది. ఇక ఆట రెండో అర్ధభాగంలో చిరాగ్ జట్టు ఓ గోల్ సాధించగల్గింది. అయితే మ్యాచ్‌ను మాత్రం 1-3 తేడాతో చిరాగ్ జట్టు కోల్పోయింది.

ఈస్ట్ బెంగాల్ జట్టు తరపున సుర్‌కుమార్, యూసుఫ్ యాకుట్, సునీల్ ఛత్రిలు ఒక్కో గోల్ సాధించారు. అదేసమయంలో చిరాగ్ జట్టు తరపున హర్దీవ్ సింగ్ సైనీ ఓ గోల్ సాధించాడు. ఈ టోర్నీ మొత్తం మీద 132 మ్యాచ్‌లు జరగనుండగా మొత్తం 12 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments