Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ సైనా సొంతం

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2008 (11:09 IST)
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఆంధ్రతేజం సైనా నెహ్వల్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సొంతం చేసుకొంది. తాజాగా చైనీస్ తైపీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ఈ హైదరాబాదీ అమ్మాయి తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకుంది.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం గతవారం 14వ ర్యాంక్‌తో కొనసాగుతూ వచ్చిన సైనా రెండు స్థానాలు మెరుగు పర్చుకుని 12వ స్థానం చేరుకుంది. మొత్తం 44,611 పాయింట్లతో సైనా ఈ ఘనత సాధించింది. ఈ ర్యాంక్‌తో బ్యాడ్మింటన్‌లో మెరుగైన స్థానం పొందిన భారత క్రీడాకారిణిగా కూడా సైనా రికార్డు సాధించింది.

తాజా ర్యాంకింగ్స్‌లో భారత నుంచి సైనా తర్వాత మరో ఇద్దరు మహిళలు మాత్రమే టాప్ 100లో స్థానం సాధించారు. సైనా తర్వాత అదితి ముతాత్కర్ 50వ ర్యాంక్‌ను సాధించగా 74వ ర్యాంక్‌లో తృప్తి ముర్గుండే నిలిచింది. అదేసమయంలో పురుషుల విభాగంలో చేతన్ ఆనంద్ భారత నెంబర్‌వన్ స్థానాన్ని సాధించాడు.

మొత్తం 30,614 పాయింట్లతో ఆనంద్ 33వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆనంద్‌తో పాటు అనూప్ శ్రీధర్ 35వ స్థానంలోను, అరవింద్ భట్ 39వ స్థానంలోను, ఆంధ్రతేజం పారుపల్లి కాశ్యప్ 57వ ర్యాంక్‌లోను కొనసాగుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments