Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ విజయం సంపూర్ణమైంది: విశ్వనాథన్ ఆనంద్

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2008 (04:38 IST)
విందు పార్టీల్లో సైతం టమేటా రసం తప్ప మరేమీ ముట్టని సాత్వికుడు విశ్వనాథన్ ఆనంద్... కాని సంవత్సరాలు గతించే కొద్దీ... అసాధారణ మేథో నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన చదరంగంలో... భారతీయ కీర్తి ప్రతిష్టలను ఆకాశమే హద్దుగా నిలపడంలో మాత్రం ఘనాపాఠిగా ఆనంద్ తయారయ్యారు..

దశాబ్దాలుగా సోవియట్ రష్యాకు చెందిన మధ్య ఆసియా ప్రాంత రాష్ట్రాలు చదరంగంపై చలాయిస్తూ వచ్చిన తిరుగులేని ఆధిక్యాన్ని ఈ తరంలోనే కాదు ఏ తరంలో కూడా ఎవరికీ సాధ్యం కాని రీతిలో చావుదెబ్బ తినిపించిన విశ్వనాధన్ ఆనంద్ కీర్తి శిఖరంలో ఈ బుధవారం గెలిచిన మూడవ దఫా ప్రపంచం చెస్ టైటిల్ ఓ కలికితురాయిగా మెరుస్తూ ఉంటుంది.
అబ్బురమనిపించిన విజయం..
  రష్యా చెస్ క్రీడాకారులపై విజయాలను అలవాటుగా చేసుకుంటూ వస్తున్న ఏకైక రారాజు మన విశ్వనాథన్ ఆనంద్. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న ఈ మూడవ దఫా చెస్ టైటిల్ కోసం ఆనందం పడ్డ కష్ట అంతా ఇంతా కాదు.      


యావత్ప్రపంచం చదరంగంలో రష్యా మేరునగధీరత్వానికి దాసోహమనిపిస్తూ వచ్చింది. బాబీపిషర్ రూపంలో, ఇతరత్రా రష్యా చదరంగ ఆధిక్యతకు అరుదుగా దెబ్బ తగులుతూ వచ్చినా రష్యా చెస్ క్రీడాకారులపై విజయాలను అలవాటుగా చేసుకుంటూ వస్తున్న ఏకైక రారాజు మన విశ్వనాథన్ ఆనందే మరి.

ప్రత్యేకించి క్రామ్నిక్‌పై విజయం ఆనంద్‌కు మరీ మధురమైనది. ఎందుకంటే ఒకే సంవత్సరంలో క్రామ్నిక్ మూడు గేములు కోల్పోవడం ఇంతకు ముందెన్నడూ జరుగలేదు మరి. ఇక సీరీస్‌లో మూడు గేములు ఓడిన విషయం మర్చిపోవలసిందేనని ఆనంద్ విజయానంతరం పేర్కొన్నాడు.

చివరి అరపాయింట్ కైవసం చేసుకునే ముందు కూడా క్రామ్నిక్ సంచలన విజయంతో ఆనంద్‌కు, చెస్ అభిమానులకు ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతి గొలిపించాడు. ఇంతటి పటిష్టమైన ప్రత్యర్థి కాబట్టే, ఓటమిని అంత సునాయాసంగా చేజార్చనీయని వ్యక్తి కాబట్టే మూడో సారు ప్రపంచ చెస్ టైటిల్ గెలుచుకున్న క్షణాల్లో ఇది తన విజయాల్లో కెల్లా సర్వసమగ్ర విజయంగా ఆనంద్ కొనియాడారు.

అందుకే ఆనంద్ సాధించిన మూడో ప్రపంచ చెస్ టైటిల్ చెస్ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే అత్యంత మేటి పోటీగా నిలబడుతుందని చదరంగ పండితులు భావిస్తున్నారు. అందుకే ఆనంద్ సగర్వంగా అన్నాడు. క్రామ్నిక్ ఒక సంవత్సరంలో మూడు గేములు కోల్పోయిన చరిత్ర గతంలో లేదని, ఇక ఒకే సీరీస్‌లో మూడు గేములు కోల్పోయిన చరిత్ర అసలే లేదని ఆనంద్ ప్రశంసించారు.

సరిగ్గా ఈ రెండింటినే ఆనంద్ సాధించారు. సంవత్సరంలోగా క్రామ్నిక్‌ను మూడు గేములలో ఓడించడం.. అదీ ఒకే సీరీస్‌లో మూడు గేములలో అతడిని ఓడించడం. ప్రపంచ చదరంగ విజేతకే అబ్బురమనిపించినంత మహత్తర విజయం ఇది. అందుకే తానింతవరకు సాధించిన విజయాలలో ఇది సర్వసమగ్ర, సంపూర్ణ విజయంగా ఆనంద్ పేర్కొన్నారు. క్రామ్నిక్‌తో చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ పోరు నిర్ణీత 12 గేములకు బదులుగా 11వ గేమ్‌లోనే ముగిసిపోవడం కూడా సామాన్యమైన విషయం కాదంటారు ఆనంద్.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న ఈ మూడవ దఫా చెస్ టైటిల్ కోసం ఆనందం పడ్డ కష్ట అంతా ఇంతా కాదు. అందుకే విజయం సాధించిన వెంటనే తాను పూర్తిగా అలిసిపోయానని ఆనంద్ చెప్పారు. టైటిల్ కోసం చేసే కఠోరమైన కృషిలో భాగంగా తాను ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై కూడా ఏ మాత్రం దృష్టి పెట్టలేకపోయానని ఆనంద్ అంగీకరించారు.

అమెరికాలో ఒబామా ప్రభంజనం గురించిన వార్తల జోలికి కూడా ఆనందం పోలేదు మరి. ముఖ్య వార్తలు, కరెంట్ ఈవెంట్లు అంటే మక్కువ చూపే ఆనంద్ ఈసారి వాటిని తన తలపుల్లోకి కూడా రానివ్వలేదు మరి. టైటిల్ కోసం తన సన్నాహకాలు ఆ స్థాయిలో జరిగాయని ఆనంద్ చెప్పారు.

ఈ మూడు ప్రపంచ చెస్ టైటిళ్లలో తనకు అభిమానపాత్రమైన టైటిల్ ఏది అని అడిగితే వేటికవే ప్రత్యేకం అని ముక్తాయించారు ఆనంద్. టైటిల్ గెలిచిన ఆనంద్, ఆయన సతీమణి భారత్‌కు ముందనుకున్న సమయానికి కాస్త ముందుగానే రావాలని భావిస్తున్నారు. నిస్సందేహంగా వీరికి అఖండ స్వాగతం లభిస్తుందని ఆశిద్దాం మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Show comments