Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియన్ గేమ్స్ నేటి నుంచే!: ఫేవరేట్లుగా భారత క్రీడాకారులు!

Webdunia
FILE
చైనా వేదికగా ఆసియన్ గేమ్స్ క్రీడోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసియా దేశాలు మాత్రం పాల్గొనే ఈ పోటీలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. దాదాపు 45 దేశాలు పాల్గొనే ఈ పోటీల్లో స్టార్ ఆటగాళ్లు తమ బలాన్ని పరీక్షించుకోనున్నారు.

1951 వ సంవత్సరంలో తొలి ఆసియన్ క్రీడోత్సవాలను నిర్వహించగా, గత 2006 సంవత్సరానికి తర్వాత చైనాలోని గువాగ్జౌలో ఈ ఏడాది చివర్లో ఈ పోటీలు అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ నెల 12 నుంచి 27వ తేదీవరకు జరిగే ఈ పోటీల్లో చైనా, భారత్, దక్షిణ కొరియా, పాకిస్థాన్, థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్త్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లతో పాటు 45 దేశాలకు చెందిన పదివేల మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.

సుమారు 52 క్రీడా స్టేడియాల్లో ఆసియన్ గేమ్స్ జరుగనున్నాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడోత్సవాలకు తర్వాత ఆసియన్ గేమ్స్‌ను చైనా ఘనంగా నిర్వహిస్తోంది.

ఇకపోతే.. ఆసియా గేమ్స్‌లో ఆడేందుకుగాను భారీ బృందాన్ని భారత్ చైనాకు పంపింది. ఈ బృందంలో 843 మంది క్రీడాకారులు ఉన్నారు. వీరిలో కోచ్‌లు, వైద్యులు, అధికారులు మినహా భారత అథ్లెట్లు మాత్రం 609 మంది కావడం విశేషం. మొత్తానికి ఆసియన్ గేమ్స్‌లో భారత్ 35 పోటీల్లో పాలుపంచుకోనుంది.

కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన గోల్డెన్ బాయ్ గగన్ నారంగ్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, సమ్రేష్, ప్రపంచ ఛాంపియన్ తేజస్వినిలతో పాటు 36 మంది షూటింగ్ విభాగాల్లో తలపడనున్నారు.

1990 వ సంవత్సరం ప్రవేశపెట్టిన కబడ్డీ పురుషుల విభాగంలో తరచూ బంగారు పతకాన్ని సొంతం చేసుకుంటున్న భారత్‌కు ఈసారి స్వర్ణం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆసియన్ గేమ్స్‌లో మహిళా కబడ్డీ పోటీలను కూడా నిర్వహించనున్నారు.
FILE


అలాగే ఆసియన్ గేమ్స్ బ్యాడ్మింటన్ విభాగంలో సైనా నెహ్వాల్, టెన్నిస్‌లో సానియా మీర్జా, సోమదేవ్ దేవ్‌వర్మన్, మహిళా బాక్సింగ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ మేరీకామ్‌లు బరిలోకి దిగుతున్నారు.

ఇంకా హాకీ, అథ్లెట్లిక్, రెజ్లింగ్, బాక్సింగ్, చెస్, హ్యాండ్‌బాల్, ఆర్చరీ విభాగాల్లో భారత క్రీడాకారులు ఓ మెరుపు మెరుస్తారని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Show comments