Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే స్టాక్ మార్కెట్ సెషన్: సన్ టీవీ నెట్ వర్క్ 25 శాతం డౌన్

Webdunia
సోమవారం, 8 జూన్ 2015 (10:45 IST)
బాంబే స్టాక్ మార్కెట్ సెషన్‌లో సన్ టీవీ నెట్ వర్క్ లిమిటెడ్ ఈక్విటీ వాటా ఏకంగా 25 శాతం పడిపోయింది. క్రితం ముగింపు రూ. 356తో పోలిస్తే రూ. 91 తగ్గి రూ. 265కు చేరింది. సన్ గ్రూప్‌లోని చానళ్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతి నిరాకరించిందని వచ్చిన వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిందని నిపుణులు చెప్పారు. 
 
ఈ చానళ్లకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చేందుకు హోం శాఖ అంగీకరించలేదని, దీంతో పలు భాషల్లో సన్ గ్రూప్ అందిస్తున్న 33 చానళ్లను మూసివేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు వ్యాఖ్యానించారు. 
 
సన్ గ్రూపు నుంచి తెలుగులో జెమినీ, జెమినీ కామెడీ, జెమినీ మ్యూజిక్, జెమినీ యాక్షన్, జెమినీ లైఫ్ తదితర చానళ్లున్నాయి. వీటిల్లో మూడేళ్లకు పైగా నడుస్తున్న చానళ్లను మూసివేయాల్సి రావచ్చని తెలుస్తోంది. కాగా, హోం శాఖ నిర్ణయాన్ని సన్ గ్రూప్ కోర్టులో సవాలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments