Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. రూ.600 తగ్గిన పసిడి ధర

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (16:59 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి వంద పాయింట్ల మేరకు లాభపడి, 26,626 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ సైతం 29 పాయింట్లు లాభపడి 8,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.14 వద్ద కొనసాగుతోంది. 
 
ఈ ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 3.26 శాతం లాభపడగా, టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌ కంపెనీల షేర్లు లాభాలను అర్జించాయి. అలాగే, టాటా పవర్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 3.54 శాతం నష్టపోయి రూ.73.60 వద్ద ముగిశాయి. వీటితోపాటు భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.
 
మరోవైపు... దేశీయంగా గురువారం రూ.30 వేల మార్కు నుంచి కిందికి దిగివచ్చింది. రూ.600 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,650కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments