నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్.. ఆరు రోజుల లాభాలకు స్వస్తి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (17:28 IST)
భారత స్టాక్ మార్కెట్ ఆరు రోజుల తర్వాత నష్టాలను చవిచూసింది. వరుసగా ఆరు రోజుల పాటు లాభాల్లో ముగిసిన సెన్సెక్స్ సూచీ.. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 190 పాయింట్ల నష్టంతో 26845 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ సైతం 48 పాయింట్లును కోల్పోయి 8129 వద్ద ఆగింది. 
 
వరుసగా ఆరు సెషన్లలో లాభాలను నమోదు తర్వాత ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలలో సైతం ఇదే ట్రెండ్ కనిపించింది. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్ద ఉన్న సెన్సెక్స్ సూచిక ఆపై నెమ్మదిగా కిందకు జారిపోయింది. 
 
మంగళవారం నాటి సెషన్లో రూ.99,30,391 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, రూ.98,81,674 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.01 శాతం, స్మాల్ క్యాప్ 0.15 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో అల్ట్రా టెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, వీఈడీఎల్, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, గెయిల్, రిలయన్స్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

Show comments