నష్టాల్లో సెన్సెక్స్ .. స్వల్పంగా బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (18:12 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో గత రెండురోజుల మాదిరిగానే శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రారంభపు ట్రేడింగ్‌లో లాభాలను చవిచూసిన సెన్సెక్స్.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 25,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 7,750 పాయింట్ల వద్ద స్థిరపడింది. 
 
ఈ ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్, టాటా పవర్, ఐడియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభపడగా, లుపిన్ సంస్థ షేర్లు అత్యధికంగానూ, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. 
 
మరోవైపు.. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు పడిపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. రూ.50 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.29,750కి చేరింది. అదేవిధంగా వెండి ధర కూడా తగ్గింది. రూ.500 తగ్గడంతో కిలో వెండి ధర రూ.39,950 కి చేరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు

తలైవర్‌తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా

అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?

ఆరోగ్యకరమైన ట్విస్ట్‌తో పండుగ వేడుకలను జరుపుకోండి: డార్క్ చాక్లెట్ బాదం ఆరెంజ్ కేక్

తర్వాతి కథనం
Show comments