Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు- 561.45 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (21:03 IST)
నేటి ట్రేడింగ్ సెషన్‌లో, భారతీయ మార్కెట్లు ఈ వారంలో లాభాలను ఆర్జించాయి మరియు ఎరుపు రంగులో ముగిశాయి. నిఫ్టీ, 10 వేలమార్కు పైన నిలిచి ఉన్నప్పటికీ, 1.58% లేదా 165.70 పాయింట్లు తగ్గి 10,305.30 వద్ద ముగిసింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 1.58% లేదా 561.45 పాయింట్లు తగ్గి 34,868.98 వద్ద ముగిసింది.
 
నేటి వాణిజ్యంలో, సుమారు 1429 షేర్లు క్షీణించాయి, 1245 షేర్లు పెరిగాయి, 134 షేర్లు మారలేదు. నేటి సెషన్‌లో, నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో ఉన్నవారిలో ఏషియన్ పెయింట్స్ (3.81%), ఐటిసి (3.36%), ఐషర్ మోటార్స్ (3.12%), హీరో మోటోకార్ప్ (2.94%), మరియు గెయిల్ (2.92%) ఉన్నాయి.
 
ఐసిఐసిఐ బ్యాంక్ (7.12%), ఇండస్ఇండ్ బ్యాంక్ (6.64%), పవర్ గ్రిడ్ (5.09%), హిండాల్కో (4.58%), జీ ఎంటర్టైన్మెంట్ (4.37%)లు ప్రముఖంగా నష్టపోయిన వారిలో అగ్రస్థానంలో ఉన్నాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 4.01% క్షీణించి, ఎరుపు రంగులో వర్తకం చేసిన ఎఫ్‌ఎంసిజి రంగంతో పాటు చెత్త పనితీరు కనబరిచింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 1.09 శాతం మరియు బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 1.15 శాతం తగ్గాయి.
 
సువెన్ ఫార్మాస్యూటికల్స్
నేటి సెషన్ లో, సువెన్ ఫార్మాస్యూటికల్స్ షేర్లు 10% తగ్గి రూ. 470.05 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. గత ఐదు వరుస సెషన్లలో భారీ ర్యాలీని ప్రదర్శించిన తరువాత, దీని షేర్లు 10% లోయర్ సర్క్యూట్లో లాక్ చేయబడ్డాయి.
 
ఐసిఐసిఐ బ్యాంక్
ప్రైవేట్ లెండింగ్ బ్యాంక్ షేర్ల అమ్మకం ద్వారా సుమారు 3 బిలియన్ల డాలర్లను సేకరించాలని ఎదురుచూస్తున్నట్లు నివేదించిన తరువాత, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు 7.12% క్షీణించాయి మరియు రూ. 349.35 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. 
 
బెర్గర్ పెయింట్స్
కంపెనీ ద్వారా నాల్గవ త్రైమాసిక ఆదాయాలు నివేంచబడిన తరువాత,  బెర్గర్ పెయింట్స్ షేర్లు 5.63% పెరిగి రూ. 544.50ల్ అవద్ద ట్రేడ్ అయ్యాయి. సంస్థ యొక్క ఆదాయాలు తక్కువ పదార్థ వ్యయం యొక్క అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి.
 
గెయిల్ ఇండియా
గెయిల్ ఇండియా వాటా 2.92% పెరిగి రూ .102.15 వద్ద ట్రేడ్ అయ్యింది మరియు నాలుగో త్రైమాసికంలో 3018 కోట్ల నికరలాభం నివేదించింది.
 
పేజ్ ఇండస్ట్రీస్
ఈ కంపెనీ పనితీరు నాల్గవ త్రైమాసికంలో దిగులుగా ఉన్నప్పటికీ నేటి సెషన్‌లో దీని స్టాక్ 8.92% పెరిగి రూ. 20,888.00 ల వద్ద ట్రేడ్ అయింది.
 
ఏషియన్ పెయింట్స్
నాల్గవ త్రైమాసికంలో పేలవమైన పనితీరు ఉన్నప్పటికీ, నేటి సెషన్ లో, ఏషియన్ పెయింట్స్ వాటా 3.81% పెరిగి రూ. 1748.00 ల వద్ద ట్రేడ్ అయింది
 
ఆర్ఐఎల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 0.67% పెరిగి రూ. 1732.50 వద్ద ట్రేడవుతోంది. సౌదీ అరామ్‌కోతో తన వార్షిక నివేదికలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
 
భారతీయ రూపాయి
నేటి ట్రేడింగ్ సెషన్లో రెండు రోజుల లాభంతో ఉన్న రూపాయి, యుఎస్ డాలర్ కు ప్రతిగా భారత రూపాయి మారకం విలువ పడిపోయి రూ .75.72 వద్ద ముగిసింది.
 
బంగారం
2012 నుండి ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ బంగారం ధరలు అత్యధిక స్థాయికి పెరగడంతో, బంగారం ధరలు ఈ రోజు అధికంగా ట్రేడ్ అయ్యాయి. ఎంసిఎక్స్ వద్ద గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 208 లు పెరిగి ప్రపంచ బంగారు ధరలలో బలమైన కొనుగోలు కారణంగా ఆగస్టు నెలలో రూ. 48,440 ల వద్ద ముగిసింది.
 
తగ్గిన గ్లోబల్ మార్కెట్ వాణిజ్యం 
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నడుమ యూరోపియన్ మార్కెట్లతో సహా గ్లోబల్ మార్కెట్లు బలహీన పడ్డాయి. లాక్ డౌన్ వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు పునఃప్రారంభించిన తరువాత కోవిడ్-19 కేసుల సంఖ్య పెరగడం పెట్టుబడిదారుల మనోభావాలను కదిలించింది.
 
ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 1.59% తగ్గగా, ఎఫ్‌టిఎస్‌ఇ 100 2.31% తగ్గింది, నిక్కీ-225, 0.07% తగ్గగా, హాంగ్ సెంగ్ 0.50% తగ్గింది మరియు, నాస్డాక్ 0.74% తగ్గింది.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments