Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ సినిమాలకు ఇన్సూరెన్సా.. వద్దు బాబోయ్: కంపెనీల వెనుకంజ!

Webdunia
శనివారం, 9 మే 2015 (14:11 IST)
సల్మాన్ సినిమాలకు ఇన్సురెన్స్ చేసేందుకు కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. 'హిట్ అండ్ రన్', 'కృష్ణ జింకల వేట కేసు', 'డ్రగ్స్ సేవించిన కేసు' తదితరాల్లో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వివిధ కేసుల్లో ఎప్పుడు ఎటువంటి శిక్ష పడుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌పై చిత్ర పరిశ్రమ సుమారు రూ. 200 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ చిత్రాలకు బీమా చేయించుకోవాలని నిర్మాతలు భావిస్తుండగా, సల్మాన్ జైలుకు వెళ్లిన పక్షంలో జరిగే నష్టానికి బాధ్యత వహించమన్న నిబంధనను బీమా కంపెనీలు చేరుస్తున్నాయి. ఒకవేళ సల్మాన్ షూటింగుకు హాజరుకాలేకపోయిన పక్షంలో జరిగే నష్టానికి పరిహారం చెల్లించమని చెబుతున్నాయి. సల్మాన్ కేసులో థర్డ్ పార్టీ క్లయిమ్‌లు కూడా చెల్లవని ఇన్స్యూరెన్స్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. 
 
సల్మాన్ కారు నడిపిన సమయంలో తాగి ఉండడం, లైసెన్స్ లేకపోవడంతో ఆయన వల్ల గాయపడిన వారు ఇప్పుడొచ్చి క్లయిమ్ చేసినా పరిహారం ఇవ్వబోమని వెల్లడించాయి. కాగా, దబాంగ్-3, ప్రేమ్ రతన్ ధాన్ పాయో, బజ్రంగీ బైజాన్ తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న నటులకు బీమా చేసేందుకు కంపెనీలు ముందుకు రావని ఐసీఐసీఐ లాంబార్డ్ హెడ్ సంజయ్ దత్తా వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments