స్వల్ప నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ సూచీ

Webdunia
బుధవారం, 25 జూన్ 2014 (16:37 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఇరాక్ దేశానికి చెందిన అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై మిలిటెంట్లు దాడిచేసిన నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 114 డాలర్లకు పెరిగింది. 
 
దీనికితోడు ఆసియా మార్కెట్లన్నీ నిరాశగా ట్రేడ్ కావడంతో వాటి ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా పడింది. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్లు నష్లాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 55 పాయింట్లు నష్టపోయి 25,314కు పడిపోయింది. నిఫ్టీ 11 పాయింట్లు కోల్పోయి 7,569 దగ్గర క్లోజ్ అయింది. 
 
ఈ ట్రేడింగ్‌లో ఇంజినీర్స్ ఇండియా, నేషనల్ అల్యూమినియం కంపెనీ, అశోక్ లేల్యాండ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐఆర్బీ ఇన్‌ఫ్రా తదితర కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా, ఎస్ బ్యాంక్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఐడియా సెల్యులార్, సుజ్లాన్ ఎనర్జీ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని పేరడైజ్ చిత్రంలోని తొలిపాట ఆయా షేర్ కు 101 మిలియన్స్ రికార్డ్

Chai Shots : టీవీ, ఓటీటీ తరహాలో చాయ్ షాట్స్ యాప్ లో పాత కొత్త సీరియల్స్: శరత్ చంద్ర

Kurchi Madathapetti: కుర్చీ మడతపెట్టి.. కేవలం 425 రోజుల్లోనే 60 కోట్ల మార్కు

సమయాన్ని వృథా చేస్తే జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాలి : రజనీకాంత్

మీ అందరి ఊహలకు అందని చిత్రంగా 'రాకా' : సన్ పిక్చర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

Show comments