285 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

Webdunia
సోమవారం, 2 మార్చి 2009 (16:42 IST)
స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 285 పాయింట్లు కోల్పోయి 8,607 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 2,674 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్... 129 పాయింట్ల నష్టంతో 8,763 వద్ద ప్రారంభమైంది.

ఈ రోజు ప్రారంభానికి ముందు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావం, గత వారం వడ్డీరేటు తగ్గింపుపై ఆర్‌బీఐ ప్రకటన లేకపోవడం వెరసి స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమయిందని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. ఆ తర్వాత రిల్, ఆర్‌పీఎల్‌ల విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం వెలువడిన అనంతరం సెన్సెక్స్ 2.78 శాతం క్షీణించింది.

దీనికి తోడు బ్యాంకింగ్, మెటల్ (లోహం) స్టాకుల రంగాల్లో విక్రయాల ఒత్తిడి.. సెన్సెక్స్‌ను మరింత బలహీనపరిచింది. ఆ తర్వాత సెన్సెక్స్ ఏ దశలోను కోలుకోలేదు. దీంతో ఇండెక్స్ కనిష్ఠంగా 8,564 వద్దకు పడిపోయింది. సాయంత్రం సమయానికి 285 పాయింట్ల నష్టంతో ముగిసింది.

బీఎస్ఈ బ్యాంకెక్స్ 5 శాతం, మెటల్ ఇండెక్స్ 4.3 శాతం చొప్పున క్షీణించాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,455 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,638 కంపెనీల వాటాలు నష్టపోయాయి. అలాగే 731 కంపెనీల వాటాలు లాభపడగా... మిగిలిన 86 కంపెనీల వాటాలు స్థిరంగా ముగిశాయి.

నష్టాలను చవిచూసిన కంపెనీలు
రిలయన్స్ ఇన్‌ఫ్రా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, జైప్రకాశ్ అసోసియేట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ, టీసీఎస్, ఓఎన్‌జీసీ, హిందుస్థాన్ యునిలివర్, గ్రాసిం, రిలయన్స్, ఎస్‌బీఐ, ఏసీసీ, భారతి ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, ఐటీసీ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.

లాభపడ్డ కంపెనీలు
మహీంద్రా అండ్ మహీంద్రా మినహాయిస్తే మరే ఇతర కంపెనీలు ఆశించిన స్థాయిలో లాభపడలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

Show comments