Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ : 20, 6వేల మార్కుల్ని తాకిన సెన్సెక్స్, నిఫ్టీ!

Webdunia
FILE
2011 తర్వాత వాణిజ్య లోటు తక్కువగా నమోదు కావడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జించింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి పురోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 266 పాయింట్ల లాభంతో 20,249 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 79 పాయింట్ల లాభంతో 6,007 పాయింట్ల మార్కును తాకింది.

ట్రేడింగ్ ప్రారంభంలో బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ తర్వాత కోలుకుని 1.8 శాతం పెరిగాయి. ఇంకా సెప్టెంబరులో దేశ వాణిజ్య లోటు గణనీయంగా తగ్గడంతో బాంబే స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. 2011 తర్వాత వాణిజ్య లోటు ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారి కావడంతో మదుపుదారులు కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపారు.

ఇంకా దేశీయ హెల్త్‌కేర్, కేపిటల్ గూడ్స్, బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఐటీ షేర్లు నష్టపోవడంతో స్టెర్లైట్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో సంస్థలు పతనమయ్యాయి. అయితే బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, జిందాల్ స్టీల్ వంటి కంపెనీలు లాభపడ్డాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments