Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఏషియాస్ క్యాపిటల్ అఫ్ కూల్' : బ్యాంకాక్ నైట్ లైఫ్ (Video)

బ్యాంకాక్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది టూరిస్ట్ ప్లేస్ అని. దీనికంటే ముందుగా థాయ్ మసాజ్ గుర్తుకు వస్తుంది. నిజానికి కేవలం మసాజే కాదు, అంతకుమించి చాలానే దొరుకుతాయి. అందుకే, ఇక్కడికి వచ్చే పర్యటకుల్

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (16:30 IST)
బ్యాంకాక్ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది టూరిస్ట్ ప్లేస్ అని. దీనికంటే ముందుగా థాయ్ మసాజ్ గుర్తుకు వస్తుంది. నిజానికి కేవలం మసాజే కాదు, అంతకుమించి చాలానే దొరుకుతాయి. అందుకే, ఇక్కడికి వచ్చే పర్యటకుల్లో అత్యధికులు 'శృంగార' జపం చేస్తుంటారు. పైగా, బ్యాంకాక్‌లో భక్తి, రక్తి రెండూ ఉంటాయి. ఇక బ్యాంకాక్‌లో ‘పటయా సిటీ’ తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. తెల్లని ఇసుక తిన్నెల బీచ్‌లో ఓ సారి దిగారంటే చాలు.. సమయమే తెలీదు.
 
బ్యాంకాక్‌లో పగలు కంటే రాత్రే అక్కడ ఎంజాయ్‌మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. నైట్ బార్స్, క్లబ్స్, నైట్ పార్టీస్ వంటి వివిధ రకాల రోజువారీ కార్యక్రమాలు అక్కడ కనిపిస్తుంటాయి. అంతేనా, ఒకటి కాదు….. రెండు కాదు వందల ఈవెంట్లు ప్రతి రోజు రాత్రి పూటనే జరుగుతాయి. ఫ్యాషన్ షో నుంచి ఫుడ్ ఫెస్టివల్ దాక అన్ని రాత్రే. ‘ఏషియాస్ క్యాపిటల్ అఫ్ కూల్’ అని పిలిచే బ్యాంకాక్‌లో రాత్రి హాయిగా ఉంటుంది. లైట్ మ్యూజిక్‌తో ఎంజాయ్ చేస్తూ రాత్రిపూట అక్కడి యూత్ రోడ్ల మీద తిరుగుతారు. అక్కడ నైట్ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఇక ఇతర దేశాల నుంచి పర్యాటకులు భారీగా అక్కడకి తరలివస్తుంటారు. వీరంతా ఎక్కువగా నైట్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తారు. 
 
ఇక వివిధ భాషలకు చెందిన సినిమా షూటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షూటింగ్స్‌తో ఆ దేశ రోడ్లు, బీచ్‌లు, పార్కులు నిత్యం రద్దీగా కనిపిస్తుంటాయి. బ్యాంకాక్ సిటీ మధ్యలో నుంచి ప్రవహించే ‘ఛా ప్రాయ’ నదిని లైట్లతో చూడముచ్చటగా డెకరేట్ చేసివుంటారు. ఇక బీచ్‌లలో అయితే రాత్రి స్పెషల్ పార్టీలకు, స్పెషల్ ఈవెంట్స్‌కి వేదిక అవుతుంది. ఈ అందాలను తిలకించేందుకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకాక్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తారు.  
 
ఇంకా ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్స్ కూడా లభిస్తాయి. ఏనుగు సవారీ, ఏనుగుల విన్యాసాలు, థాయ్ సాంప్రదాయ వంటకాలు, డ్యాన్సులు, వివిధ రకాల పోరాటాలు.. ఒకటేంటీ ఇంకా చాలా ప్రత్యేకతలను మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఎర్వాన్ వాటర్ ఫాల్ ప్రాంతాన్ని చూడకుండా మాత్రం బ్యాంకాక్ టూర్‌ను ఏ ఒక్కరూ తిరిగిరారంటే అతిశయోక్తి కాదేమో. 
 
ఇక థాయ్ మసాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం మసాజే కాదు, అంతకుమించి చాలానే దొరుకుతాయి. అందుకే, ఇక్కడికి వచ్చే పర్యటకుల్లో అత్యధికులు శృంగార రసాన్ని అనుభవించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, పర్యటకులంతా కేవలం సెక్స్ కోసమే థాయ్‌లాండ్ వస్తున్నారనే ప్రచారాన్ని అక్కడి ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. అలాంటి బ్యాంకాక్‌లో నైట్‌లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం