Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకృతి అందాల అహ్మద్‌పూర్ మాండ్వి బీచ్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2011 (19:15 IST)
గుజరాత్ విశాల సముద్రతీరంలో ప్రకృతి అందాల నడుమ ఉంది అహ్మద్‌పూర్ మాండ్వి బీచ్. తెల్లని సముద్ర కెరటాలు తీరాన్ని తాకుతుంటే కొత్త అందాలను సంతరించుకుంటుంది అహ్మద్‌పూర్ మాండ్వి. గుజరాత్‌లో మరెక్కడా లేనివిధంగా వివిధ జల క్రీడలను ఔత్సాహికులు ఇక్కడ ఆడుకోవచ్చు.

సముద్ర తీర అందాలతో పాటుగా క్రీడలు ఆడేవారి కోసం వాటర్ స్కూటర్స్, స్కికింగ్, సర్ఫింగ్, పారా సైలింగ్, స్పీజ్ బోట్స్ వంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సముద్ర తీరాన్ని తనివితీరా చూసేవారి కోసం గుజరాత్ పర్యాటక శాఖ ప్రత్యేక రిసార్టులను ఇక్కడ ఏర్పాటుచేసింది.

అహ్మద్‌పూర్ మాండ్వి తీరానికి సమీపంలోనే డయూ దీవి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లటానికి వీలుగా సముద్రంపై వంతెన నిర్మించారు. దీనిపై ప్రయాణిస్తుంటే మధ్యధరా సముద్రంపై వెళుతున్న అనుభూతి కలుగుతుంది పర్యాటకులకు.

వసతి
ఇక్కడకు వచ్చే పర్యాటకుల కోసం గుజరాత్ పర్యాటక శాఖ హోటెల్‌తో పాటుగా ఇతర సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : జాంనగర్ సమీపంలో విమానశ్రయం.

రైలు మార్గం : అహ్మదాబాద్-వీరావల్ మార్గంలో డెల్వాడా (9 కి.మీ.) సమీపంలోని రైల్వే స్టేషన్.

రహదారి మార్గం : రాజధాని అహ్మదాబాద్‌కు 298 కి.మీ. దూరంలో అహ్మద్‌పూర్ మాండ్వి ఉంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments