Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగార ప్రేరేపిత తీరాలు

పుత్తా యర్రం రెడ్డి
FileFILE
రోటీన్ పనులు... ఉదయం నుంచి ఉరుకులు... పరుగులు... కార్యాలయం... ఇల్లు.. ఇలా యేడాది పొడవునా యాంత్రిక జీవన జీవిత భాగస్వామితో ఆప్యాయంగా మాట్లాడి ఆనందాన్ని పంచుకునే రోజులు చాలా తక్కువ. ఇదే పరిస్థితి సంసార జీవితంపై పడుతుంది. ఇంటి వచ్చినా వదలని సెల్‌ ఫోన్లు... ల్యాండ్‌ లైన్లు... ఇలాంటి వారికి కావలసిందల్లా సహధర్మచారిణి ఏకాంతం....

ఇందుకోసం ఎక్కడికెళ్ళాలో తెలియని వారెందరో ఉన్నారు. దంపతులు పరస్పరం శృంగార ప్రేరేపితం అయ్యే ప్రదేశాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇదే కోవలోకి కొన్ని సముద్ర తీరప్రాంతాలు కూడా ఉన్నాయి. చల్లని పిల్లగాలులు... ఎగిసి పడే అలలు... ప్రశాంత వాతావరణం... ఏకాంత ప్రదేశాలు.... ఇవన్నీ ఆ దంపతులలో శృంగారాన్ని ప్రేరేపిస్తాయి.

పరస్పరం ఆనందాన్ని పంచుతాయి. ఇలాంటి ప్రదేశాలలోనే హోటళ్ళు, ప్రత్యేక విడిది గృహాలు అన్ని సౌకర్యాలు కలిగిన ప్రదేశాలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి వాటిలో అండమాన్ నికోబార్, లక్ష్యదీవులు ఈ కోవలోకి వస్తాయి. ప్రేమ పక్షులకు నిలయంగా ఉన్న గోవా తీరం కూడా దాదాపు ఇలాంటి వాతావరణాన్నే కలిగి ఉంటుంది. అంజున దోన పౌల, కలంగుట్ తీరాలలో కూడా ఉత్తేజ పరుస్తాయి. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా అత్యాధునికంగా ఉంటాయి.

బగా, బెనులిమ, పొలోలెం తీరాలు ఏకాంతం కోరుకునే దంపతుల అభిరుచులకు అన్ని విధాలా సరిపోతాయి. దియూ బీచ్ దంపతులలోని రోమాంటిక్ మూడ్‌ను తట్టి లేపుతుంది. అక్కడి వాతావరణం చాలా బాగుటుంది. ఈ బీచ్ ఎక్కడా లేనంత శుభ్రంగా కనిపిస్తుంది. కేరళలోని పయ్యంబళం కూజా సుంద ప్రదేశమే. ముజప్పిలంగాడ్ బీచ్‌లో ఈత కొలనులు, సన్‌బాత్‌లు ప్రత్యేకార్షణగా నిలుస్తాయి.

ఇక్కడే మరో శృంగార ద్వీపం కూడా ఉంది. ఇక్కడి నుంచి సముద్ర సోయగాలను చూడవచ్చు. ఇక పుదుచ్ఛేరి వైపు చూస్తే పర్యాటకానికి పెట్టింది పేరుగా చెప్పవచ్చు. హిందూ మహా సముద్రం దంపతులకు అంతులేని సంతృప్తినిస్తుంది. భారతావనిలో ఇలా ఎన్నో శృంగారతీరాలున్నాయి. వాటిని తాకాలంటే జీవిత భాగస్వామిని వెంటబెట్టుకుని రొటీన్ కార్యక్రమాలకు స్వస్తి చెప్పాల్సిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments