Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతయ్య పంచ్: కుంట లేని వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు!!

Webdunia
FILE
దేశ రాజకీయాల్లో రోజు రోజుకీ పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ ముద్రతో కోట్లాది రూపాయలను దండుకునే రాజకీయ నేతలు ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే కోట్లు దండుకుంటున్నారనే వార్తలు వినొస్తున్నాయి. అందుకే కాబోలు సీతయ్య హీరో హరికృష్ణ కూడా కుంటలేని వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారని బావ మరిది ఇండైరక్ట్‌గా దెప్పిపొడిచారు.

ఈ సెటైర్ తన బావమరిది కాదు.. రాజకీయ నేతలందరికీ కాబోలు. ఈ మాటలు ఎదుటివారు సంపాదించుకుంటున్నారనే ఆక్రోషంతో అన్నారో లేక... ఎందుకో తెలియదు గానీ మొత్తానికి సీతయ్య, బాబయ్య కోల్డ్‌వార్ ప్రారంభమైంది.

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రోజు రోజుకు ముదిరి పాకానపడుతోంది. కుంటలేని వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారని హరికృష్ణ రాసిన బహిరంగ లేఖతో నందమూరి - నారా కుటుంబాల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. ఈ విబేధాలు కాస్త ఇరువర్గాల మధ్య చినికి చినికి గాలివానగా మారింది.

హరికృష్ణ రాసిన బహిరంగ లేఖను చంద్రబాబు హైదరాబాద్‌లో నిర్వహించిన అవినీతి ర్యాలీ సందర్భంగా విడుదల చేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో గ్రూపులు వేదికగా ఇరువురు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. దేవినేని ఉమకు బాబు బాసటపై హరికృష్ణ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో ఇలాంటి విభేదాలు పొడచూపడం ద్వారా చంద్రబాబు, హరికృష్ణల మధ్య దూరం పెరిగిపోతోంది. ఇరు కుటుంబాల మధ్య గల విభేదాలను జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖండించకపోవడంతో హరి-బాబుల మధ్య తప్పకుండా విభేదాలు రాజుకుంటున్నాయనడంలో ఎలాంటి సంశయమూ లేదు.

కాగా, నందమూరి హరికృష్ణ సంధించిన బహిరంగ లేఖాస్త్రం తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తన తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ డాక్టర్ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ హరికృష్ణ తన లేఖలో పేర్కొనడం తెదేపా శ్రేణులను విస్తుపోయేలా చేసింది.

ఎన్టీఆర్ ఆశయాల పరిరక్షణ కోసం తాను పోరాడతానని హరికృష్ణ ఆ బహిరంగ లేఖలో విమర్శనాస్త్రాలు సంధించారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను వెలికి తీయాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. మొత్తం మీద సీతయ్య సంధించిన లేఖాస్త్రం ఆ పార్టీలో పెను తుఫానునే సృష్టించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

Show comments