Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా.. నీకెందుకు తల్లీ.. ఈ దుస్థితి.. ఇప్పటికైనా తేడా తెలుసుకో..?

Webdunia
WD
తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన ప్రముఖ నటి రోజాపై ఆ పార్టీ నేతలు నోరు విప్పారు. టీడీపీలో సముచిత స్థానం కల్పించిన రోజాకు టైం బాగోలేదని.. అందుకే ఎమ్మెల్సీ గంగా భవాని వంటి వారు రోజాను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలుగుదేశం నేత పీఎల్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి రోజాను స్వయంగా ఆహ్వానించి తీసుకున్నా ఆమెకి అవమానాలు తప్పడం లేదని పీఎల్ అన్నారు.

తెలుగుదేశం పార్టీలో ఆమెను చాలా గౌరవంగా చూసుకునేవారని, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తుంటే.. ఎమ్మెల్సీ గంగాభవాని లాంటి వారి నోళ్లలో రోజా నానుతుందని పీఎల్ వెల్లడించారు. ఇప్పటికైనా.. రోజాకు టీడీపీకి, కాంగ్రెస్‌కు తేడా ఏమిటో? తెలిసి ఉండాలని ఆయన తెలిపారు.

మరోవైపు రోజాకు టీడీపీలో సముచిత స్థానం కల్పించి రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి తగిన గుర్తింపు కల్పించినా నిలబెట్టుకోలేకపోయిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

ఇకపోతే.. సినీ నటి అయిన రోజా రాజకీయ భవిత ఏమిటో ఇంకా అవగతం కాలేదని.. తెలుగుదేశం పార్టీకి స్వస్తి చెప్పిన తరహాలోనే రోజా తన రాజకీయ జీవితానికి కూడా స్వస్తి చెబుతుందేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు.. రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి సినిమాలో అడపాదడపా పాత్రలు చేసుకుంటుందనుకుంటే.. సినిమా వాళ్లపై కూడా రోజా చేసిన విమర్శలు అంతా ఇంతా కాదని.. అక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బ తగులుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రోజా.. గోడపై పిల్లిలా ఏ వైపు దూకుతుందో? వేచి చూడాల్సిందే..!.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సంపూర్ణేష్ బాబుతో పవన్ ఫోటో మార్ఫింగ్- హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు

Nara Lokesh: ఓల్డ్ స్టూడెంట్స్ పాఠశాల మార్గదర్శకులుగా మారాలి.. నారా లోకేష్

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

Show comments