Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాకు గ్లామర్ లేదు.. ఆమెంత కౌన్ కిస్కా గొట్టం!

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2009 (19:54 IST)
FILE
ప్రముఖ సినీతార రోజాకు టైం బాగోలేనట్టు తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రిని కలిసి తెలుగుదేశం పార్టీకి శత్రువైన రోజా.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతానని కొమ్మ పట్టుకుని వేలాడుతోంది. ఈమె రాకపై కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఈ విషయంపై ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాభవానీని విలేకరులు మెల్లగా రోజా వ్యవహారంపై ప్రశ్నించగా.. కయ్‌మని కేకలు వేస్తోంది. మొదట రోజా గురించి తన వద్ద అడగవద్దంటూ ముఖాన్నే చెప్పేశారు. "ఆమె కౌన్ కిస్కా గొట్టం.. కాంగ్రెస్‌లోకి వస్తే ఎంత? రాకపోతే ఎంత? ఆమె వస్తే మా పార్టీకి ఒరిగేదేమీ లేదని ఘాటుగానే మండిపడ్డారు. తెదేపాలో ఉండగా వైఎస్‌పై చేసిన విమర్శలు మరిచి పోగలమా అంటూ గంగా భవానీ ప్రశ్నించారు.

మొత్తానికి రోజా తెదేపా తీర్థం పుచ్చుకుంటారని వార్తలు రాగానే.. చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగింది. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటుంటేనే ఇక్కడ పెను ఘోరం జరిగిపోయిందనీ గంగాభవానీ ఉదహరించారు. ఒక విధంగా రోజాది ఐరెన్ లెగ్ కాదనీ.. ఆమెది ఎలిఫెంట్ లెగ్ అని గంగా భవానీ వాపోయారు.

ప్రస్తుతానికి రోజా సంగతులు అనవసరమని దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడమే తన ముందున్న లక్ష్యమని గంగాభవానీ పేర్కొంటూ విలేకరులకు టాటా చెప్పేశారు.

ఇంకేముంది..? రోజాను ఎందరో ఏవేవో మాటలనేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు తెలుగుదేశం పార్టీకి సోమవారం గుడ్‌బై చెప్పిన రోజా ఈ విమర్శలపై ఏ విధంగా స్పందిస్తుందో..? వేచి చూడాల్సిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments