Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరి మీ జిల్లాలో మాటేమిటి?

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2008 (17:06 IST)
వార్త : కోస్తాలోని కొన్ని జిల్లాలకు తాను ఇన్‌ఛార్జి మంత్రిగా ఉండి జరిపిన పరిశీలనలో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి కేవలం నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్‌నే మళ్లీ గద్దెనెక్కించాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

చెవాకు : మీరు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నందున పరిస్థితిని పూర్తిగా మీ పార్టీకి అనుకూలంగా ఉండేలా చేశారా లేక ప్రజలు మీరే కావాలని, మీ పాలన తప్ప మరో గత్యంతరం లేదని భావిస్తున్నారా?

మీ పార్టీయే గెలుస్తుందనే నమ్మకం ఉంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయిన టీడీపీ నుంచి బయటకు వస్తున్న వారు మీ పార్టీలో చేరవచ్చు కదా. ప్రయోజనం లేకుండా బయటకు రాని వారందరూ ప్రజారాజ్యంలోకే ఎందుకు వెళుతున్నట్టు.

అందులోనూ మీది అధికార పార్టీ. మరో ఆరునెలల పాటు అధికారంలో ఉండే అవకాశం కలిగి ఉన్నవారు. మిమ్మల్ని కాదని మరో పార్టీలోకి వెళుతున్నారంటే ఆలోచించాల్సిన విషయమేగా.

అందులోనూ మీ పార్టీ నుంచి హరిరామ జోగయ్య అంతటి సీనియర్ మరో పార్టీలోకి ఎందుకు వెళ్లినట్టు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ మీ పార్టీ నుంచి కూడా భారీగా వలసలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఔను మంత్రివర్యా, మీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

Show comments